Tuesday, 26 May 2015

రైతుల సంక్షేమమే ముఖ్యం : ఎంపీపీ


రెబ్బెన : రెబ్బెన మండలంలోని గంగాపూర్‌లో మంగళవారం మన తెలంగాణ మన వ్యవసాయం యాత్రలో ఎంపీపీ సంజీవ్‌ కుమార్‌ హాజరై మాట్లాడుతూ ... తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, ముఖ్యమంత్రి కెసీఆర్‌కు రైతుల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. రైతులు సేంద్రీయ ఎరువులను వాడాలని, చెరువులో తీసిన మట్టిని పంటపొలాల్లో వేసుకుని విత్తనాలు సరైన సమయంలో నాటాలని, ఈ సంవత్సరం ఎరువుల కొరత ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాబురావ్‌, సర్పంచ్‌ రవీందర్‌, వెటర్నరీ డాక్టర్‌ సాగర్‌, రవీందర్‌, తదితర నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment