రెబ్బెన, మే12(వుదయం ప్రతినిధి): కాగజ్ నగర్ మండలంలోని హరేగూడ గ్రామా పరిదిలో గల 17 రజక కుటుంబాలు తమకు వారం లో ఒక రోజు సెలవు కావాలని అడిగినందున, హరేగూడ కు చెందినా అరె మరియు ఇతర కులస్తులు కలిసి 17 రజక కుటుంబాలను గ్రామా బహిష్కరణ చేసి వారికి సహాయనిరాకరణ మరియు వారిని బట్టలు ఉతకడానికి పిలవడం లేదు అని అటువంటి వారిని కటినంగా శిక్షించాలని వారు రెబ్బెన మండల తహసిల్డారుకు వినతి పత్రం సమర్పిస్తూ కోరారు, ఈ కార్యక్రమంలో రజక కుల రాష్ట్ర నాయకులూ కడ్తాల మల్లయ్య, మండల రజక కుల సంఘం అధ్యక్షులు రామడుగుల శంకర్, జిల్లా నాయకులూ చంద్రగిరి శ్రీనివాస్, రాచకొండ రమేష్, పొదిలి రంగయ్య, తిరుపతి, రాములు పాలుగోన్నారు.
No comments:
Post a Comment