(రెబ్బెన వుదయం ప్రతినిధి, మే 18) రెబ్బెన మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 13వబెటాలియన్ 150మంది సిబ్బంది, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు అందరు కలిసి సోమవారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుభ్రం చేశారు. కరెంటు వైర్ల పనులు, రంగులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బోర్డులను రాశారు. గుడిపేట కమాండర్ చక్రధర్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ గురించి అవగాహన కోసం పోలీసులు ఈవిధంగా స్వచ్చభారత్ చేస్తున్నామని, ప్రతిఒక్కరు స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని అన్నారు. ఈకార్యక్రమంలో సిఐ యశ్వంత్ రాజ్, నాగానాయక్, సీఐ నాగేంద్ర, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ సరస్వతీ, ఎస్సై కిరణ్, ఎస్సై బాబురావ్, రెబ్బెన ఎస్సై సిహెచ్ హనుక్, పోలీసుసిబ్బంది, బెటాలియన్ అధికారి డాక్టర్ సంతోష్ సింగ్, సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment