రెబ్బెన మండలంలోని మేడే సందర్భంగా ఎడవెల్లి గ్రామంలో శుక్రవారం నాడు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా సీపీఐ మండల సహాకార్యదర్శి ముల్యం బుద్దజీ జెండాను
ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జాడి గణష్ హజరై
మాట్లాడుతూ నేడు కార్మిక హక్కుల దినం కావడంతో కార్మికుల హక్కులకై పొరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జాడి తిరుపతి, నారాయణ, ఎడవెల్లి గ్రామ సహాయ కార్యదర్శి దుర్గం గోపాల్ పాల్గొన్నారు.
రెబ్బెన మండలంలోని ఘనంగా జరిగిన మేడే వేడుకలు
రెబ్బెన మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ
మండల కార్యదర్శి శంకర్ జెండావిష్కరించారు. అనంతరం కార్మికుల హక్కుల దినోత్సవం కాబట్టి కార్మికుల
హక్కులకై పోరాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షులు ఉపేంధర్,
ఎఐవైఎఫ్ మండల కార్యదర్శి సంతోష్, ఎఐవైఎఫ్ ఆసిఫాబాద్ డివిజన్ కార్యదర్శి, పెద్దయ్య, గణష్, శంకర్‌లు
పాల్గొన్నారు
No comments:
Post a Comment