Friday, 22 May 2015

వాహనాల తనిఖీ


రెబ్బెన మండల కేంద్రంలో శుక్రవారం పోలీసుస్టేషన్‌ ప్రధాన రహదారి వద్ద వాహనాలను రెబ్బెన ఎస్సై హనుఖ్‌ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైసెన్సులు లేనివారు వాహనాలు నడుపరాదని, వాహన పత్రాలు లేకుండా ప్రయాణం చేస్తే జరిమానాలు విధించడం జరుగుతుందని ఆయన అన్నారు. మద్యంసేవించి వాహనాలను నడుపరాదని ఆయన అన్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

No comments:

Post a Comment