Thursday, 21 May 2015

ఆంధ్రప్రభ యాప్‌ను ప్రారంభించిన తహసీల్ధార్‌


రెబ్బన: తాజా విశేషాలను యాప్‌ ద్వారా ప్రజలకు మరింతలో చేరవేసే భృహత్తర కార్యక్రమాన్ని ఆంధ్రప్రభ చేపట్టడం అభినందనీయమని తహసీల్ధార్‌ జగదీశ్వరి తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఆమె ఆంధ్రప్రభ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్ధార్‌ మాట్లాడుతూ... స్థానిక వార్తలను సైతం యాప్‌ ద్వారా ప్రజలకు మరింత చెరువ చేయడంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో యాప్‌ను ప్రవేశ పెట్టడం శుభ పరిణాయమన్నారు. ఎప్పటికప్పుడు తాజా వార్తలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ముందుకెళ్లాలని ఆకాంక్షీంచారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment