Wednesday, 6 May 2015

ఆర్‌టీసీ కార్మికుల సమ్మెతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు


రెబ్బెన, మే 6 (వుదయం ప్రతినిధి): ఆర్‌టీసీ కార్మికుల సమ్మెతో డిపోలోనే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెబ్బెన నుండి ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి  వెళ్ళలంటే ఆటోలను ఆశ్రయించవలసి వస్తుంది. రోజు నిన్నటిదాక ఉన్న ఆటో చార్జిలు నేడు ఆర్‌టిసి సమ్మెతో మూడింతలు పెంచారు ప్రయాణికులు వాపోతున్నారు. బుధవారం వివహ శుభాకార్యాలు అధికంగా ఉండటంతో ప్రయాణీకులు చేసేదిఏమి లేక ఆటో వాల్లు అడిగిన కాడికి చార్జిలు చెల్లించి ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తాత్కలికంగా ఆర్‌టిసి బస్సులు నడిపేటట్లు చర్యలుతీసు కోవాలని పలువురు ప్రయాణీకులు కోరుచున్నారు

No comments:

Post a Comment