Thursday, 28 May 2015

కార్మికుల శ్రమ దోచుకుంటున్న ప్రభుత్వం

రెబ్బెన : మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లో కెఎల్‌ మహేంద్ర భవన్‌లో కార్మికుల సమావేశం గురువారం నిర్వహించారు. ఎఐటీయూసీ కోల్‌బెల్టు ఏరియా ఇంచార్జి భానుదాస్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్‌ చేయాలని, కార్మికులను తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మెలో పాల్గొన్నారని, రాష్ట్ర ఆవిర్బావంలో పాల్గొన్నారని, ఇప్పుడు కెసీఆర్‌ ప్ర భుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈకార్యక్రమంలో జోగి ఉపేందర్‌, రామస్వామి, అశోక్‌, తదితర నాయకులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment