జాగృతి పోస్టర్లు ఆవిష్కరణ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 30 September 2016
విద్యార్థి దశ నుండే సమాజ సేవ అలవర్చుకోవాలి
విద్యార్థి దశ నుండే సమాజ సేవ అలవర్చుకోవాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); విద్యార్థి దశ నుండే సమాజ సేవ ను అలవర్చుకోవాలని సాయి విద్యాలయం ఇంగ్లిష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ఢీకొండ విజ కుమారి అన్నారు . రెబ్బెన సాయి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో మంచిర్యాలలో డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ స్వాచ్చ్చంద సంస్థకు , పేద విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి 8025 రూపాయలు నగదును ఆ సంస్థ సభ్యుడు నాగరాజు కు అందచేశారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాద్యాయుడు డికొండ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ మన కోసం మనం కాకుండా ఇతరులకు సహాయం చేయడములో ముందుకు రావాలని తెలిపారు . పేద విద్యార్థుల కోసం సహాయం చేయుటలో మా పాఠశాల విద్యార్థులు ముందంజలోఉన్నారని అన్నారు. ఈ సందర్భముగా ట్రస్ట్ సోషల్ వర్కర్ నాగరాజు,పాఠశాల ఉపాధ్యాయులు రాజన్న, తిరుపతి ,సుజాత ,మల్లీశ్వరి ,విద్యాసాగర్ ,రేష్మ, ఉష, వినిత,ఆశలతో విద్యార్థులు పాల్గొన్నారు
రెబ్బెనలో ఘనముగా భగత్ సింగ్ జయంతి
రెబ్బెనలో ఘనముగా భగత్ సింగ్ జయంతి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం కేంద్రంలోని స్థానిక వసతి గృహంలో భగత్ సింగ్ జయంతి ఘనముగా నిర్వహించారు. తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా అధ్యక్షుడు కడ్తల సాయి అద్వర్యంలో భగత్ సింగ్ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మరణాన్ని లెక్క చేయకుండా ఉద్యమ ఆకాంక్షను ప్రజలకు తెలియాని వీరమరణం పొందిన గొప్ప వ్యక్తి అని, విప్లవ కారుడు అని అన్నారు అయన ఆశయ సాధనకు యువత ముందుండాలి అని తెలంగాణ విద్యార్థి వేదికగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టి వి వి జిల్లా ఉప అధ్యక్షుడు మేడి వినోద్ ,మండల కార్యదర్శి జాగిరి వేణు,నాయకులూ తిరుపతి, శ్రీనివాస్, వసంత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Friday, 23 September 2016
ఉగ్ర వాద దాడి నీచమైనది
ఉగ్ర వాద దాడి నీచమైనది
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); భారత సైన్యం పై ఉగ్రవాదులు దాడి చేయడం అతి నీచమైన చర్య అని రెబ్బెన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు అన్నారు. శుక్రవారం రెబ్బెన ప్రముఖ వీధుల గుండా క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు . అనంతరం వారు మాట్లాడుతూ కుల , మాత ప్రాంతాలకు అతీతంగా అందరు కలిసిమెలిసి ఉండే భారత దేశం పై ఉగ్రవాదులు నిద్రిస్తున్న సైనికులపై దాడి చేయడం పిరికి దద్దమ్మల చర్య అని వారు మండిపడ్డారు . జమ్మూ కాశ్మిర్ యూరి సైనిక స్థావరం పై ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది వీర జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను పట్టుకొని వారి కి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని వారు అన్నారు .
సంస్థ అభివృద్ధికి పాటుపడుదాం -జి ఎం రవిశంకర్
సంస్థ అభివృద్ధికి పాటుపడుదాం -జి ఎం రవిశంకర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రతి కార్మికుడు సింగరేణి సంస్థ మనది అనుకుని సమిష్టి కృషితో అభివృద్దికి పాటుపడదామని జి ఎం రవిశంకర్ అన్నారు . బెల్లంపల్లి ఏరియాలోని ఖైరి గూడా ఓపెన్ కాస్ట్ లో మల్టి మీడియా డిపార్ట్మెంట్ సమావేశములో పాల్గొని మాట్లాడారు . సంస్థలో పని చేసే ప్రతి ఒక్కరు అంకిత భావముతో ఉత్పత్తి ఉత్పాదకతపై ద్రుష్టి సారించాలని తెలిపారు . జులై 2016 నాటికి 60 కోట్ల నష్టముతో ఉన్నదని ఈ నష్టము నుండి బయట పడాలంటే రాబోయే కాలములో యంత్రాల వినియోగం పెరగాలని , కార్మికుల పని గంటలు విఇనియోగం పెంచాలని అన్నారు . ఖర్చులు తగ్గించుకోవాలని తెలిపారు . మల్టి డిపార్ట్మెంటల్ సభ్యుడు యోహాన్ స్లైడ్స్ ద్వారా లాభ నష్టాలు అభివృద్ధి పనులు వివరించారు . 300మంది కార్మికులు , సూపెర్విశేర్లు పాల్గొని సూచనలు ఇచ్చ్చారు . ఈ కార్యక్రమములో అధికారులు మోహన్ రెడ్డి , రమేష్ , , చిత్తరంజన్, రామారావు , రాజమల్లు , నాయకులూ సదాశివ్ , తిరుపతి కో ఆర్డీ నేటర్ కుమారా స్వామీ , సెల్ కమ్యూనికేషన్ అధికారి రాజేశ్వర్ లు ఉన్నారు .
సర్కారు ది సవితి తల్లి ప్రేమ : దుర్గం రవీందర్
సర్కారు ది సవితి తల్లి ప్రేమ : దుర్గం రవీందర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రభుత్వ విద్య ఫై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తు సవితి తల్లి ప్రేమ వహిస్తుందని ఏ ఐ ఎస్ ప్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ ఆరోపించారు. శుక్రవారం రెబ్బన మండలం గోలేటి లోని కే ఎల్ మహేంద్ర భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారం లో కి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందని ద్రాక్ష ల మిగిలి పోతుందని అన్నారు. కెసిఆర్ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన కేజి టూ పిజి హామీని ని వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేసారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజనాన్ని పెట్టాలని , సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి ప్రతి వసతి గృహానికి శాశ్వత వార్డెన్ ,వాచ్ మెన్ ,కుక్ , కామాటి పోస్ట్ లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చెసారు ఈ కార్యక్రమాం లో ఏ ఐ ఎస్ ప్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, మండల అధ్యక్షులు కస్తూరి రవి కుమార్ ,ఉపాధ్యక్షులు మహిపాల్ , శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులను పెర్మనెంట్ చేయాలి
బెల్లంపల్లి ఏరియాలోని గనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసి సదుపాయాలను ఏర్పాటు చేయలని బోగే ఉపేందర్ అన్నారు. రెబ్బెన మండలంలోని గోలేటి జీఎం కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించి జీఎం కు వినతి పత్రం అందజేశారు . అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సింగరేణి సంస్థల్లో అన్ని విభాగాలలో పనిచేస్తున్నా కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలనీ హెచ్ పి సి వేతనాలు 2013 జనవరి నుండి అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులుగా అమలు చేయాలి బకాయిలు వెంటనే చెల్లించాలి కాంట్రాక్టర్ మరీనా కార్మికులను మార్చరాదని అన్నారు.
ఐకెపి విఓఏ ల సమస్య ల పై వినతి
ఐకెపి విఓఏ ల సమస్య ల పై వినతి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఐకేపీ విఓఏ సమస్యలను నెరవేర్చకుండ చాలీచాలని బకాయి జీతాలతో నిరంతరం అన్ని రకాల పనులు చేయించుకుంటూ వేతనాలు చెల్లించకుండా అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఐకెపి విఓ ఏ ల మండల అధ్యక్షులు గజ్జెలి భీమేష్ అన్నారు. గురువారం నాడు గౌతమి మండల సమాఖ్య రెబ్బెన కార్యాలయంలో జనరల్ బాడి సమావేసంలో ఏరియా కోఆర్డినేటర్ అన్నాజీ ముఖ్యఅతిధి గా పాల్గొన్నారు ఈ సమావేశం లో గౌతమి మండల సమాఖ్య అధ్యక్షురాలు, ఎపియం వెంకటరమణ కు వినతిపత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండ చాలీచాలని బకాయి జీతాలతో నిరంతరం అన్ని రకాల పనులు చేయించుకుంటూ వేతనాలు చెల్లించకపోవడం అన్యాయం అన్నారు . గ్రామాల్లో విఓఏ లు స్వయం సహాయక సంఘాల పనులతో పాటు డిపార్ట్ మెంట్ కు సంబందించిన ఇంకా ఇతర అనేక పనులు నిర్వహిస్తున్నారు . వీరికి నెలకు 2000/-ల చొప్పున చెల్లిస్తామని 2013 మే 30 న సెర్ప్ నుండి సర్క్యులర్ జారీ అయింది . కానీ నేటికీ వేతనాలు విడుదల కాలేదన్నారు , స్వయంగా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్బంగా అనేక సభల్లో విఓఏ లకు వేతనం 5000/-రూ లకు పెంచుతామని ప్రకటించారు . ఇచ్చిన హామీలను అమలు చేసి విఓఏ ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు .డిమాండ్స్ :- 2013 జూన్ నుండి 40 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి , ప్రభుత్వం ఎన్నికల సందర్బంగా పెంచుతానన్న రూ. 5000/-లు వేతనం పెంచాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ,ఆరోగ్యబీమా సదుపాయం కల్పించాలి ,సెర్ప్ హెచ్ . ఆర్ ను వర్తింపచేయాలి ,సంఘాలకు వి ఎల్ ఆర్ వడ్డీలేని రుణాలు 10 లక్షల వరకు పొడిగించాలి ,చనిపోయిన విఓఏ కుటుంబాల సభ్యులకు ప్రమాద బీమా అమలు చేయాలనీ డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో డోంగ్రీ తిరుపతి , క్రిష్ణ , శ్రీకాంత్ , రవి , లింగయ్య ,శ్రీనివాస్ , ,శంకర్ ,చంద్రశేఖర్ ,ch తిరుపతి, సులోచన ,రాజేశ్వరి ,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
జోనల్ వ్యవస్థ రద్దు ప్తె హర్షం
జోనల్ వ్యవస్థ రద్దు ప్తె హర్షం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం తో పాటు జోనల్ వ్యవస్థ రద్దు చేయడం ప్తె పి అర్ టి యు హర్షం వ్యక్తం చేస్తుందని పి అర్ టి యు మండల అధ్యక్షుడు ఖాదర్ ప్రధాన కార్యదర్శి రవి కుమార్ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల సదానందం పేర్కొన్నారు. రెబ్బెన మండలంలో వారు విలేకర్లతో మాట్లాడుతూ సి పి ఎస్ విధానం కుడా రద్దు చేస్తే ఉపాధ్యాయుల కు చాల మేలవుతుందని సి పి ఏస్ విధానం రద్దు అయితేనే నిరుద్యోగులు కుడా సంతోషిస్తారని అన్నారు. సి పి ఏస్ విధానం ప్తె ప్రభుత్వం అలోచించి నిర్ణయం తీసుకోవాన్నారు కోత్త జిల్లాలు ఏర్పడిన అనంతరం పి అర్ టి యు అధ్వర్యంలో సమస్య పరిష్కారానికి అందోళన చేస్తామన్నారు. ఈయన వెంట పి అర్ టి యు నాయకులు వెంకటేష్,శ్రీనివాస్ లు వున్నారు.
Wednesday, 21 September 2016
పురుగుల మందు సేవించి యువతి ఆత్మహత్య
పురుగుల మందు సేవించి యువతి ఆత్మహత్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన తన్నీరు జ్యోతి(20)బుధవారం రోజున పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడింది.రెబ్బెన ఎస్ ఐ డి. సురేష్ కథనం ప్రకారం మృతురాలు తాండూర్ విద్యాభారతిలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుందని తెలిపారు . జ్యోతి ఈ నెల 16 న చెవినొప్పితో భాద పడుతూ స్థానిక ఆర్.యం.పి డాక్టర్ బి.రాజ్ కుమార్ వద్దకు వెళ్లిందని , అతను వైద్యం చేస్తున్న క్రమంలో మృతురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు . దీంతో ఈ నెల 19న జ్యోతి ఆర్.యం.పి వైద్యుడి వద్దకు వెళ్లి అతన్ని కొట్టడం జరిగింది . విషయం బయటికి పొక్కటంతో గ్రామస్థులు యువతిని తప్పుపట్టారు. ఈమె రు. దీంతో మనస్థాపం చెందిన యువతీ బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి శ్రీనివాస్ పేర్కొన్నారు . . శ్రీనివాస్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుఎస్ ఐ దారం సురేష్ తెలిపారు. సంఘటన స్థలాన్ని సి ఐ కరుణాకర్ సందర్శించారు.
విద్య రంగ సమస్యలను పరిష్కరించాలి ; పుదారి సాయికిరణ్
విద్య రంగ సమస్యలను పరిష్కరించాలి ; పుదారి సాయికిరణ్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలలో విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని ఎ ఐ ఎస్ ఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయికిరణ్ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య అద్వర్యం లో రెబ్బెన తహశీల్ధార్ రమేష్ గౌడ్ కు వినతిపత్రాన్ని బుధవారం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్య మంత్రి కె సి ఆర్ ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేసి మోస పూరితంగా వ్యవహరిస్తున్నారని , హామీలకు మాత్రమే పరిమితమయ్యారని అన్నారు . కె జి నుండి పిజి వరకు ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని , కళాశాలల్లో ని విద్యార్థులకు మధ్యాహన భోజనాన్ని పెట్టించాలని తెలిపారు . హాస్టళ్లల్లో పర్మినెంట్ వార్డెన్లను, వాచ్మెన్ లనురెగ్యులర్గా నియమించాలని డిమాండ్ చేశారు . ఖాళీగా ఉన్న ఎం ఐ ఓ , డి ఐ ఓ పోస్టులను భర్తీ చేయాలని , పాఠశాలల విలీననాన్ని విరమించుకోవాలని పేర్కొన్నారు . కనీస వసతులు లేని పాఠశాలల, కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని అన్నారు . లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్కరించారు . నాయకులు మహేందర్ , సంపత్ , వినయ్ , శివ శంకర్ , మహిపాల్ , సందీప్ , శ్రీకాంత్ , వెంకటేష్ , ప్రశాన్తలు ఉన్నారు .
రెబ్బెన పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం తో అందని చెక్కు ;; ఆందోళనలో బాధితులు
రెబ్బెన పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం తో అందని చెక్కు
ఆందోళనలో బాధితులు
ఆందోళనలో బాధితులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రములో గల పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యముతో బాదితునికి సరియైన సమయములో చెక్కు అందలేదని బాధిత కుటింబీకులు లబో దిబో అంటున్నారు . రెబ్బెనలో నివాసముంటున్న సయ్యద్ ముజాహిద్ ఉద్దిన్ గత కొంత కాలంగా వ్యాధితో బాధ పడుతూ చికిత్స పొందుతుండే వాడని , వారు పేద కుటుంభానికి చెందిన వాడని బంధువులు తెలిపారు . చికిత్స కోసం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా తేదీ 29/ 07/ 2016 నాడు 40000/-రూపాయల చెక్కు మంజూరు అయిందని భార్య హజార బేగం బంధువులు ఎజాజ్ , ఖాయడ్ ఉద్దీన్ తెలిపారు . కుటుంభానికి ఆ సమయములో డబ్బులు అందితే ఎంతో కొంత ఊరటగా ఉండేదని భార్య ఆవేదన వ్యక్తం చేసింది . ముజాహిద్ ఉద్దీన్ తేదీ 08 / 08 / 2016 నాడు మృతి చెందగా , మంజూరు అయినా చెక్కు మాత్రం స్థానిక పోస్టుమ్యాన్ 19 / 09 / 2016 రోజున మృతుని బంధువులకు ఇవ్వడముతో విషయం బయటకు పొక్కింది . కాగా చెక్కు కాలపరిమితి అయిపొయింది . దింతో ఏమి చేయలేక బంధువులు స్థానికులతో పోస్ట్ ఆఫిస్ కు వెళ్లి పోస్ట్ మాస్టర్ను నిలదీశారు . పోస్ట్ మాస్టర్ కె మధుకర్ మాట్లాడుతూ పోస్ట్ డెలివరీ 29/07/2016 న చేశామని , అతనిపై చర్యలు తీసుకొనే అధికారం మాకు లేదని ఆయన అన్నారు . పిర్యాదు ఇస్తే తపాలా ఉన్నత అధికారులకు నివేదికను పంపిస్తామని తెలిపారు . ఎజాజ్ తో పాటు టి ఆర్ ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్ , నాయకులు ఖయాద్ ఉద్దీన్ చిరంజీవిగౌడ్ గోగర్ల ప్రవీణ్ చోటు లు ఉన్నారు .
Tuesday, 20 September 2016
ఉత్పత్తి ఉత్పాదకత పెంపుకై గనుల పై మల్టి డిపార్ట్ మెంట్ పర్యటన
ఉత్పత్తి ఉత్పాదకత పెంపుకై గనుల పై మల్టి డిపార్ట్ మెంట్ పర్యటన
( రెబ్బెన వుదయం ప్రతినిధి) మల్టి డిపార్ట్ మెంటల్ టీమ్ 23నుంచి 29 వరకు బెల్లంపల్లి ఏరియా లోని వివిధ గనుల్లో పర్యటించడం జరుగుతుందని ఏరియా జీఎం రవిశంకర్ అన్నారు . రెబ్బెన మండలంలోని గోలేటి జీఎం కార్య లయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు మల్టి డిపార్ట్ మెంట్ బృందాలు డిపార్ట్ మెంట్ , గనులవద్దకు వెళ్లి సమస్త మనుగబొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత బొగ్గు లక్ష్యాలను అధికమించడం లాంటి విషయాలపై అవగాహనా కల్పించడం జరుతుందండని అన్నారు 23 వ తేదీన ఖైర్గుడా ఓపెన్ కాస్ట్ 24 న దొర్లి ఓపెన్ కాస్ట్ 26 న బి పి ఏ ఓ సి 2, 27న జీఎం కార్యాలయంలోని అన్ని డిపార్ట్మెంట్ లు 28న ఎక్సప్లరేషన్ డిపార్ట్మెంట్ మరియు ఏరియా ఆస్పత్రి 29ఏరియా వర్క్ షాప్ స్టోర్ లలో ఈ డిపార్ట్మెంట్ వారు పర్యటించి కార్మికులకు అవగాహనా కల్పించడం జరుగుతుంది . ముఖ్యంగా బెల్లంపల్లి ఏరియా పాటు కొన్ని ఏరియా లు బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడి ఉంది బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించడం వల్ల ప్రశ్నతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయడం లాంటి వాటిపై కార్మికులకు అవగాహనా కల్పించడం జారుగుతుంది కార్మికుల సమిష్టి సహకారం కృషితో ఈ సంవత్సరం అధిక లక్ష్యాలను కృషిచేస్తామని బొగ్గు ఉత్పత్తికి సంబందించిన అన్ని ప్రణాళికలను సిద్ధం చేసినట్లు జీఎం తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ ఓ 2 జీఎం కొండయ్య ,డి జి ఏం పర్సనల్ చిత్తరంజన్ కుమార్ ప్రాజెక్ట్ అధికారుల సంజీవ్ రెడ్డి, మోహన్ రెడ్డి ,దేవేందర్ ,డి వై పి ఏం లు సుదర్శన్ ,రాజేశ్వర్, ఐ ఈ డి యుహన్ తదితరులు ఉన్నారు.
Friday, 16 September 2016
కాంట్రాక్టు కార్మికులకు అవకాశం కల్పించాలి
కాంట్రాక్టు కార్మికులకు అవకాశం కల్పించాలి
రెబ్బెన వుదయం ప్రతినిధి సింగరేణి యాజమాన్యం తలపెట్టిన మీ కోసం మీ ఆరోగ్యంకోసం కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికులకు అవకాశం కలిపించాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ బ్రాంచి ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ , మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్యలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతు యాజమాన్యం కార్మికులు వారి కుటుంబాల ఆరోగ్యం కోసం తలపెట్టిన దానిలో కాంట్రాక్టు కార్మికులకు అవకాశం కల్పించాలని అన్నారు గత 15సం లు గా కాంట్రాక్టు కార్మికులు సింగరేణి యాజమాన్యం లాభాలు రావడానికి , మరియు సంస్థ అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నారు కాంట్రాక్టు కార్మికులు , పర్మనెంట్ కార్మికులు అనే భేదంతో వారిని విభజించి పాలిస్తున్నారన్నారు పర్మనెంట్ కార్మికులను పట్టించుకోని కాంట్రాక్టు కార్మికులను పట్టించుకోక పోవడం చాల బాధాకరం అని అయన అన్నారు.
వార్షికోత్సవాలను విజయవంతం
వార్షికోత్సవాలను విజయవంతం
రెబ్బెన వుదయం ప్రతినిధి తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలనీ పొన్నం శంకర్ అన్నారు రెబ్బెన మండలంలోని ప్రయాణ ప్రాంగణంలో మంగళవారం సి పి ఐ జెండాను ఆవిష్కరించి అనంతరం వారు మాట్లాడుతూ నాటి నైజం నిరంకుశ పాలన అంతం కోసం భూ స్వామ్య వర్గాల దోపిడీకి రజాకార్ల దౌర్జన్యాన్ని వ్యతిరేకముగా భారత కమ్యూనిస్టు పార్టీ సి పి ఐ తెలంగాణ సాయుధ పోరాటాన్ని సాగించింది ఈ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టు ఉద్యమకారులు తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించారు ఈ వీరోచిత సాయుధ పోరాటం వలన నిజం నిరంకుశ పాలన అంతమైంది 1948 సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ విముక్తి సాదించి భారతదేశంలో తెలంగాణ విలీనం చేయబడింది తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశంలో భూ సంస్కారణ లకు కౌలుదారు శాసనాలకు వెట్టి చాకిరి నిర్ములనకు అనేక చట్ట సంస్కారణల ఆవశ్యకతకు మార్గదర్శకం చూపించింది అని అన్నారు. కావున సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచ దినం ను ప్రభుత్వం అధికారకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జగ్గయ్య , బోగే ఉపేందర్, రాయిల్లా నర్సయ్య, సాయి తదితరలు ఉన్నారు.
యువకుని హత్య - ఇద్దరిపై కేసు నమోదు
రెబ్బెన వుదయం ప్రతినిధి రెబ్బెన మండలములోని దేవులగుడ లో సోమా వారము మాలోతు భరత్ కుమార్ (22) మృతికి కారణమైన అదే గ్రామానికి చెందిన ,రాజేందర్ కుమార స్వామిల పై కేసు నమోదు అయినట్లు రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ అన్నారు . మంగళ వారము ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం ఆది వారము మృతుడు భరత్కుమార్ , రాంకుమార్ లు సులుగు పల్లికి వెల్లి తిరిగి దేవులు గుడాకు సోమవారము వచ్చ్చారు . అప్పటికే మద్యం సేవించి ఉన్నారని ఎస్ ఐ పేర్కొన్నారు . రైస్ మిల్ సమీపములోని హోటల్ లోభరత్కుమార్ట్, కుమారస్వామి లుఉన్నారు . అక్కడికి వఛ్చిన రాజేందర్ ఎక్కడికి వెళ్లారని వారిని అడగగా రాజేందర్ భార్యను అసభ్యకరంగా మాట్లాడడముతో ప్రెక్కనే ఉన్న ఇనుప రాడ్ తో భరత్కుమార్ ను తలపై , భుజముపై , నడుముపై తీవ్రంగా కొట్టాడని ఎస్ ఐ తెలిపారు . అనంతరము తాండూర్ మండల్ లోని ఐబీ కి వెళ్లి వారు తప్పతాగి వచ్చ్చినట్లు , రోడ్ పై దించి కుమారా స్వామి వెళ్లి నట్లు తెలిపారు . రోడ్ పై భరత్ కుమార్ స్పృహ తప్పి పడి పోయారని , హాస్పిటల్ కి తీసికెళ్తే అప్పటికే భరత్కుమార్ మృతి చెందినట్లు ఎస్ ఐ తెలిపారు . ఈ మేరకు రాజేందర్ , కుమారస్వామిల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు. కుటుంబసభ్యలు గ్రామస్థులు మత దేశహం తో అంతర్ రాష్ట్ర రాహదారి ప్తెన రాస్తారోకో నిర్వహించారు . అలాగే 108 సేవల అందుబాటులో ఉంచాలని మృతిని బంధువులు కోరారు.
Monday, 12 September 2016
బిజెపి నాయకులు తిరంగా పతాక ర్యాలి
బిజెపి నాయకులు తిరంగా పతాక ర్యాలి
(రెబ్బెన వుదయం ప్రతినిధి) బిజెపి నాయకులు రెబ్బెన మండలంలో సోమవారం విద్యార్థులతో తిరంగా పతాక ర్యాలీని నిర్వహించి అంబేత్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళ్ళు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరములు కావస్తున్నందున దేశ వ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్ర ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచ దినం ను ప్రభుత్వం అధికారకంగా చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రంలో జెబి పొడేల్, కె ఆంజనేయులు గౌడ్, బాలకృష్ణ, చక్రపాణి, సురేందర్, మధుకర్, మల్లేష్, రమేష్ తదితరాలు పాల్గొన్నారు.
సర్వ మతాల ఐక్యతకు ఎంతో అవకాశం - పురాణం సతీష్ కుమార్
సర్వ మతాల ఐక్యతకు ఎంతో అవకాశం - పురాణం సతీష్ కుమార్
రెబ్బెన వుదయం ప్రతినిధి రెబ్బెన మండలంలో కమీటీ బృందాలు కలిసి మెలిసిణము ఉత్సవాలను జరుపుకోవాలని , ఇవి మతాల ఐక్యతకు నిదర్శనము అని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ అన్నారు . సోమవారం రెబ్బెనలోని సాయి గణేష్ మండలి , నవయుగ గణేష్ మండలి కమిటీ వారు అన్న దాన కార్యక్రామాన్ని నిర్వహించారు . ఈ అన్న దాన ము లో ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి , ఆదిలాబాద్ ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమారు లు పాల్గొన్నారు . అనంతరం వారు మాట్లాడుతూ ఎం ఎల్ సి కావాలని గత సంవత్సరము నవీన్ జాస్వాల్ అన్నదానం చేయడం , ఈ సంవత్రసారము నేను ఎం ఎల్ సి గా రావడము ఎంతో సంతోషముగా ఉందని అన్నారు . రెబ్బెన మండల లో ని గల్లీ గల్లీ లో సిమెంట్ రోడ్స్ వేయిస్తామని అన్నారు . ఈ కార్యక్రములో జెడ్ పి టి సి బాబు రావు , స్థానిక సర్పంచ్ వెంకటమ్మ , ఏ ఎం సి వైస్ చైర్ మెన్ కుందారపు శంకరమ్మ, ఉప సర్పంచ్ - బి. శ్రీధర్, నాయకులూ సుదర్శన్ గౌడ్ , చిరంజీవి గౌడ్ , సోమశేఖర్, శ్రీధర్ , నవీన్ జైస్వాల్ , ప్రవీణ్ , రాజేశ్వర్ రావు , రాజాగౌడ్, శ్రీనివాసరావు , వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.
శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి- ఎస్ ఐ సురేష్
శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి- ఎస్ ఐ సురేష్
( రెబ్బెన వుదయం ప్రతినిధి) సెప్టెంబర్ 11; శాంతి యుతంగా అందరు కలిసి గణేష్ ఉత్సవాలను జరుపు కోవాలని రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ అన్నారు . ఎస్ ఐ మాట్లాడుతూ గణేష్ ఉత్సవ కమిటీ వారు గణేష్ మండలి వద్ద డి జె ల ను వాడొద్దని , వాడినచో డి జె లను సీజ్ చేస్తామని పేర్కొన్నారు . గణేష్ నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ మండలి వారు జాగ్రతలు తీసుకోవాలని తెలిపారు .డీజే లను వాడడానికి ప్రభుత్వ అనుమతులు లేవని ఈ విషయం అందరు గమనించాలని అన్నారు .
అశేష పూజలు అందుకొంటున్న గణనాథులు
అశేష పూజలు అందుకొంటున్న గణనాథులు
( రెబ్బెన వుదయం ప్రతినిధి) సెప్టెంబర్ 11; రెబ్బెన మండల కేంద్రరములోని గణనాథులు అశేష పూజలు అందుకుంటున్నారు . ప్రతి రోజు వినాయకునికి భక్తులు భక్తి తో కుంకుమార్చనలు చేస్తున్నారు . వేదం భ్రహ్మ ణోత్తములచే పూజలందుకొంటున్నాడు . 7 వ రోజైన ఆదివారము రాశీ బాలాజీ గణేష్ మండలి వద్ద మండలి కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . అదే విదంగా దుర్గ దేవి దేవాలయము ఉన్నా గణేష్ మండలి కమిటీ వారు కూడా అన్నదానం నిర్వహించారు . మండలములోని భక్తులు ఈ అన్నదాన కార్య క్రమములో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొన్నారు . సాయంత్రము మంగళ హారతులతో భక్తులు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు .
Sunday, 11 September 2016
ఘనం గా చాకలి ఐలమ్మ వర్ధంతి.
ఘనం గా చాకలి ఐలమ్మ వర్ధంతి...
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);రెబ్బెన మండల కేంద్రంలోని R&B గెస్ట్ హోజ్ లో శనివారం రోజున చాకలి ఐలమ్మ 31వ వర్దంతి ని రజక సంఘం అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి కొబ్బరికాయలు కొట్టారు అనంతరం తెలంగాణ రాష్ట్ర రజక సంఘం మండల అధ్యక్షా కార్యదర్శి లు మాట్లాడూ తూ తెలంగాణ ర్తెతంగా సాయుధ పోరాటం చేసి దళిత బడుగు బలహిన వర్గాల. ప్రజల పోరాడిన వీర వనిత ని కొనియాడారు.తెలంగాణ రాష్ట్రం వచ్చ కా చాకలి ఐలమ్మ ను గుర్తించక పోవడం ఆమె వర్దంతి ని అధికారికంగా నిర్వహించక పోవడం భాధకరమని అన్నారు.తెలంగాణ. ప్రభుత్వనికి ఉద్యమ సమయంలో అయిలమ్మ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం చేస్తానని చెప్పి తెలంగాణ వచ్చాక పట్టించుకోక పోవడం కే సీ ఆర్ దోరతనం కు నిదర్శనము అని అన్నారు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మరియు ప్రతి డివిజన్ కేంద్రం లో ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో రజక సంఘం నాయకులు గడ్డం సుధాకర్,కొత్తపల్లి అశోక్,కొండపర్తి జనగామ విజయ్ కుమార్,రంజిత్ కుమార్,సత్తన్న,కడతల సాయి,సంగం శ్రీనివాస్,డా" శ్రీను,శ్రీకాంత్,రాంబాబు,రవిందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Friday, 9 September 2016
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘానా సన్మానం
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘానా సన్మానం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలములో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను పి ఆర్ టి యూ రెబ్బేన శాఖా ఆధ్వర్యములో ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయులు ఎం శంకర్ రావు (నావెగామ్ ), ఎం ఫ్లోరెన్స్ ( కొత్తగూడెం ) లను మండల విద్యాధికారి ఎం వెంకటేశ్వర్ల తో సహా ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ సందర్బంగా ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకిత భావముతో తమ వృత్తికి న్యాయం చేస్తే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. ఈ కార్య క్రమములో రాష్ట్ర కార్యదర్శి కె జనార్దన్, జిల్లా ఉపాధ్యాయులు బి సదానందం, మండల అధ్యక్షుడు ఎస్ కె ఖాదర్, ప్రధాన కార్యదర్శి డి రవి, పి జి ఎహ్ ఎం స్వర్ణ లతా జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎస్ వెంకటేశం, కె శ్రీనివాస్ లు ఉన్నారు.
ఐ.టి.ఐ కళాశాల ఫీజుల దోపిడీని అరికట్టాలి -దుర్గం రవీందర్
ఐ.టి.ఐ కళాశాల ఫీజుల దోపిడీని అరికట్టాలి -దుర్గం రవీందర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రైవేట్ ఐ.టి.ఐ కళాశాలల్లో అక్రమంగా వసూలు చేస్తున్న ఫిజులను అరికట్టాలి.ఏ ఐ ఎస్ యఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేసారు . ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా లోని ప్రైవేట్ ఐ.టి.ఐ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న సంబంధిత శాఖ అధికారులు చూచిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయనే ఆశతో విద్యార్థులు ఐ.టి.ఐ కళాశాలల్లో చేరుతున్నారని ,దీనిని ఆసరాగా చేసుకొని యాజమాన్యులు విద్యార్థుల నుండి 30000 నుండి 35000 వరకు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని ,అంతే కాకుండా పరీక్ష ఫీజుల పేరిట వేలాది రూపాయలు దండుకుంటారన్నని అన్నారు . ఎలాంటి వసతులు కల్పించకుండా నిర్లక్షము వహిస్తూ ధనార్జనే ద్యేయంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొన్ని కళాశాలల్లో అక్రమంగా అడ్మిషన్లు చేసుకుంటున్నారని అలాంటి కళాశాలను గుర్తుంచి క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేసారు . అధిక ఫీజులు తీసుకొంటున్న ఐ.టి.ఐ కళాశాలలపైనా చర్యలు తీసుకోవాలని లేని పక్షములో ఏ ఐ ఎస్ యఫ్ ఆధ్వర్యములో ఆందోళనలు నిర్వహిస్తామని అలాగే జిల్లా కలెక్టర్, ఆర్ డి డి (వరంగల్ ) గారికి త్వరలోనే ఏ ఐ ఎస్ యఫ్ ఆధ్వర్యములో పిర్యాదులు చేయనున్నట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి సాయి ,మండల అధ్యక్షులు రవి, మహిపాల్ ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 7 September 2016
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); గణేష్ ఉత్సవాలను అందరూ కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంతో సోదరభావంతో 11రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని తాండూర్ సీఐ కరుణాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం రెబ్బెన అతిధి గృహావరణలో పోలీసులు గణేష్ ఉత్సవ కమిటి సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా సీఐ కరుణాకర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 11రోజుల పాటు భక్తి శ్రద్దలతో సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలని గణేష్ మండళ్ల నిర్వహకులకు సూచించారు. ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే మైకులు వాడాలని ఆతర్వాత ఎట్టి పరిస్థితుల్లో మైక్ వాడరాదని రెండు స్పీకర్లు మాత్రమే వాడాలని డిజె సౌండ్ సిస్టమ్ వాడటానికి అనుమతిలేదని సూచించారు. గణేష్ మండలి వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా కమిటీ సభ్యులే భాద్యత వహించి చివరి నిమర్జనం రోజున ఎలాంటి అవకతవకలు జరగకుండా నవరాత్రి ఉత్సవాలను ముగించాలని కోరారు. ఈ సమావేశంలో రెబ్బన ఎస్సై దారం సురేష్ , ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్ , జడ్పిటిసి బాబురావు, నార్లాపూర్ సర్పంచ్ భీమేష్ రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ,సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య, సుదర్శన్ గౌడ్ ,దుర్గం సోమయ్య తదితర గణేష్ ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వైభవంగా వినాయక చవితి వేడుకలు
వైభవంగా వినాయక చవితి వేడుకలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); వినాయకచవితి ఉత్సవాలు రెబ్బెన మండల వ్యాప్తంగా వైభవంగా కొనసాగాయి.గ్రామాలలో వీధివీధిన గణనాథులను మంటపాలలో ప్రతిష్టించారు. వెరైటి గణనాథులు ప్రజలకు కనువిందు చేశాయి.భక్తి శ్రద్ధలతో వినాయకునికి దూపదీప నైవేద్యాలతో పూజలు చేశారు. బొజ్జగణపయ్యకు మారేడు దళాలు, మాచీ, బదరీ, చూత, తులసీ ,కరవీర తదితర పత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించడంలో భక్తి ప్రపత్తులతో ఇష్టమైన వంటకాలను, ఫలాలను సమర్పిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ రోడ్, దేవులగూడ, ఇంద్రానగర్, నక్కలగూడ, గంగాపూర్, గోలేటి లలో ప్రతిష్టించారు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయక ఉత్సవాల సందర్భంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఐకేపీ విఓఏ ల మండల నూతన కార్యవర్గం ఎన్నిక
ఐకేపీ విఓఏ ల మండల నూతన కార్యవర్గం ఎన్నిక
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఐకేపీ విఓఏ ఉద్యోగుల సంఘం సమావేశం రెబ్బెన గెస్టుహౌస్ లోమంగళవారం నిర్వహించి నూతనకార్యవర్గం ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి డివిజన్ ఉపాధ్యక్షులు ఫైమా ముఖ్య అతిధి గా హాజరురై మాట్లాడారు విఓఏ ల సమస్యల గురించి మాట్లాడుతూ 40 నెలల బకాయి వేతనాలు ఇవ్వకుండా ,ప్రభుత్వం ఇచ్చిన 5000/- వేతనం హామీ నెరవేర్చకుండా విఓఏ లను పట్టించుకోకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . 10వ తేదీన తూర్పుజిల్లా మంచిర్యాల ఉద్యోగుల సర్వసభ్య సమావేశం బెల్లంపల్లి లో నిర్వహించడం జరుగుతుందని ఆ సమావేశానికి అందరు విఓఏ లు అధిక సంఖ్య లో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరరు. అదేవిదంగా రెబ్బెన మండల కమిటీ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు అధ్యక్షులుగా గజ్జెల్లి భీమేష్ ,ఉపాధ్యక్షులుగా నల్లగొండ వెంకటేష్ ,ప్రధానకార్యదర్శిగా మొర్లే తిరుపతి ,సహాయకార్యదర్శిగా మైలారం శ్రీనివాస్ ,కోశాధికారిగా డోంగ్రి తిరుపతి లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ సమావేశం లొ కమిటీ సభ్యులుగా కృష్ణ ,రవికుమార్ ,శంకర్ ,శ్రీకాంత్ ,పరమేష్ ,ప్రకాష్ ,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Saturday, 3 September 2016
జ్వరముతో తల్లి కొడుకు మృతి
జ్వరముతో తల్లి కొడుకు మృతి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తీవ్ర జ్వరముతో మండలములో తల్లి కొడుకు లు శుక్ర వారము రాత్రి మృతి చెందడముతో మండలము లోని రాళ్లపేట లో విషాద ఛాయలు అలుముకున్నాయి . వివరాలలోకి వెళితే సంచార జాతికి చెందిన రాథోడ్ అనిత , సంపత్ దంపతులు సంవత్తరము క్రితం రాళ్లపేటకు వలస వచించారు . కూలి పనులు చేసుకొంటూ జీవనం కొనసాగిస్తున్నారు వీరికి ఇద్దరు సంతానం ఉండగా వారిలో పెద్దవాడైన చిరుత (10 ) , తల్లి సునిత గత జ్వరము రావడముతో ఆసుపత్రికి తీసుకెళ్లారు . సునీత , చిరుత లు తీవ్రమైన విష జ్వరముతో శుక్రవారం రాత్రి మృతి చెందారు.
మట్టి వినాయకుల పంపిణి
మట్టి వినాయకుల పంపిణి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి ఆధ్వర్యములో శనివారం జి ఎం కె రవిశంకర్ , సేవ సమితి అధ్యక్షురాలు అనురాధ చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మట్టి విగ్రహాలతో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించ వచ్చ్చని తెలిపారు . రంగు పూసిన విగ్రహాలను వాడితే నిమజ్జనం చేసినప్పుడు నీళ్లు మొత్తం కలుషిత అవుతాయని వారు తెలిపారు . ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను భక్తి శ్రద్దలతో పూజించి వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని అన్నారు . ఈ కార్య క్రమములో నాయకులూ ఎస్ తిరుపతి , ఎం శ్రేణివాస రెడ్డి , కుండఁదరపు శంకరమ్మ ,డి వై జి ఎం చిట్టా రంజాన్ , డి వై ఫై ఎం సుదర్శన్ , రాజేశ్వరరావు లు ఉన్నారు.
అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే తొలగించిన అంగన్వాడీలను వెంటనే విధుల్లోకి తీసుకోని ,ఏ ఐ టి యు, ఎన్ రాయిలా నర్సయ్య , అంగన్వాడీ కార్యకర్తలు శనివారం రెబ్బన తసీల్ధార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందచేశారు అనంతరం వాలు మాట్లాడుతూ కనీస వేతనం 18000/- రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు ,జి ఓ నె0. 4 ను సవరించి అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ,పి ఎఫ్ మరియు ఇ ఎస్ ఏ ,బోనస్ చట్టాలను విధిగా అమలుచేయాలని అందరి పెన్షన్ గారంటీ ఇవ్వాలని మరియు కార్యకర్తలకు సూపెర్వైసేర్ ఎక్సమ్ పెట్టి తీసుకోవాలని ఈ కార్య క్రమములో చంద్రకళ,ప్రమీల, బాలమ్మా , రాజేశ్వరి , సుజాత , సుశీల లతో పాటు , తదితర అంగన్వాడీ కార్య కర్తలు ఉన్నారు.
సునందిని పశువుల దూడల దాణా పంపిణి
సునందిని పశువుల దూడల దాణా పంపిణి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన పశు వైద్య శాలలో స్స్నిశనివారం సునందిని పశువుల దూడల దాణా పంపిణి చేసారు. పశు వైద్యాధికారి డా . ఎస్ .సాగర్ మాట్లాడుతూ మొత్తం 39 రైతులకు 120 కేజీల చొప్పున మొత్తం 4680కేజీల దాణాను పంపిణి చేయడం జరిగింది . ఈ పథకంలో ఎస్ సి మరియు ఎస్ టి రైతులకు 75% సబ్సిడీపైన మరియు బి సి మరియు ఓ సి రైతులకు 50% సబ్సిడీపైన దాణ ను పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమము లో జడ్పీటీసీ - బాబురావు,ఎంపీపీ - సంజీవ్ కుమార్, సర్పంచ్ - పెసారు వెంకటమ్మ,ఉప సర్పంచ్ - బి. శ్రీధర్,పి ఏ సి ఎస్ డైరెక్టర్ -పెసారు మధునయ్య,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ - కుందారపు శంకరమ్మ,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ - పల్లె రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు .
Friday, 2 September 2016
తొలగించిన అంగన్ వాడి లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
తొలగించిన అంగన్ వాడి లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);తొలగించిన అంగన్వాడీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సి ఐ టి యు ,ఏ ఐ టి యు, ఎన్ ఎస్ యు ఐ , ఐ కె పి నాయకులూ రమేష్ , రాయిలా నర్సయ్య , భరద్వాజ్ , డి తిరుపతి లు అన్నారు. శుక్రవారం రెబ్బన ప్రధాన రహదారి ఫై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు . వారు మాట్లాడుతూ మధ్యాహన భోజన కార్మికులను , ఆశ వర్కర్లను , ఐ కె పి సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు . కాంట్రాక్ట్ కార్మికులందరికి కనీస వేతనం 18000/- రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు . అదే విదంగా కార్మిక చట్టాల సవరణను ఆపాలని , పి ఎఫ్ , ఏ ఎస్ ఐ సౌకర్యా కల్పించాలని తెలిపారు . ఈ కార్య క్రమములో నాయకులు ఆర్ శంకర్ , రామ , సరస్వతి , బాలమ్మ , చంద్రకళ రాజేశ్వరి , సుజాత , సుశీల , శ్రీనివాస్ లతో పాటు ఆశ వర్కర్లు , అంగన్వాడీ కార్య కర్తలు ఐ కె పి సిబ్బంది ఉన్నారు.
కాంట్రాక్ట్ లెక్చలర్లను పర్మినెంట్ చేయాలి
కాంట్రాక్ట్ లెక్చలర్లను పర్మినెంట్ చేయాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); కాంట్రాక్టు లెక్చలర్లను పర్మినెంట్ చేయాలని కాంట్రాక్టు లెక్చలర్ల సంఘం గంగాధర్ అన్నారు. శుక్రవారం వాల్ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పదవ పీఆర్సీ ప్రకారం నెలకు 37100 ఇవ్వాలని అన్నారు. కాంట్రాక్టు లెక్చలర్ల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని అన్నారు. అదేవిధంగా మహిళా లెక్చలర్లకు ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు లెక్చలర్ల అందరికి హెల్త్ కార్డులతో పాటు గ్రూప్ ఇన్సూరెన్సు ఇవ్వాలని అన్నారు. తీవ్ర జబ్బులతో బాధపడే వారిని కోరుకున్న ఉద్యోగంలో చేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ప్రవీణ్, ప్రకాష్, అమరేందర్, వెంకటేశ్వర్లు, నిర్మల, సుమలత, రామారావు, వరలష్మి, జాన్సీ, మల్లీశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
ఏ ఐ టి యూ సి, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
ఏ ఐ టి యూ సి, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);దేశ వ్యాప్తిత సమ్మెలో భాగంగా సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ మరియు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను గోలేటిలో దహనం చేశారు. ఈ సందర్బంగా ఏ ఐ టి యూ సి బ్రాంచ్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ మాట్లాడుతూ కార్మికులకు కనీసవేతనం 18వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ లను రద్దు చేసి రెగ్యులర్ చేయాలనీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ స్కిం లలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలని అన్నారు. కార్మిక చట్టాల సవరణను నిలిపివేయరన్నారు. ప్రభుత్వ కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటాల అమ్మకాన్ని ఆపాలన్నారు. 45రోజుల్లో కార్మికుల సంఘాల రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఆరెపల్లి రామస్వామి, సహాయ కార్యదర్శులు రాం కుమార్, నాయకులు శంకర్, రాజ శేఖర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, పూదరి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
అక్రముగా నిల్వ వుంచిన రేషన్ బియ్యం పట్టివేత
అక్రముగా నిల్వ వుంచిన రేషన్ బియ్యం పట్టివేత
జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సరఫరా శాఖ వారు గురువారం తనిఖీ చేస్తుండగా రెబ్బెన మండలంలో ప్రకాష్ దగ్గర 7. 50 క్వింటాల బియ్యం 2. 50 క్వింటాల గోధుమలు పట్టుకున్నారు ఎం డి జమీర్ ఆసిఫాబాద్ డి టి , ఏ ఎస్ ఓ జితేందర్ రెడ్డి ఆసిఫాబాద్, ఏ ఎస్ ఎఫ్ రియాజ్ డి టి కాగజనగర్,మోనిల్ డి టి తాండూర్ ,ప్రకాష్ డి టి కౌటాల ఎం ఏ అలీ రెబ్బెన తహసీల్దార్ సిబ్బంది సర్వర్ పాల్గొన్నారు ఇలాంటి అక్రమ రవాణా జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
భూనిర్వాసితులకు న్యాయం చేయండి - కోదండరాం
భూనిర్వాసితులకు న్యాయం చేయండి - కోదండరాం
వట్టి వాగును పరిశీలిస్తున్న కోదండరాం
హవానం పలుకుతున్న గిరిజనులు
సభలో మాట్లాడుతున్న కోదండరాం
వట్టి వాగును పరిశీలిస్తున్న కోదండరాం
హవానం పలుకుతున్న గిరిజనులు
సభలో మాట్లాడుతున్న కోదండరాం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);వట్టి వాగు క్రింద భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని జె ఏ సి కోదండ రామ్ అన్నారు . బుధవారం వట్టి వాగును పరిశీలించి మాట్లాడారు . ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న అన్నివర్గాల అభివృద్ధి కొరకు జయశంకర్ ఆశయాలను నెరవేరుద్దామని ప్రొపెసర్ కోదండరాం అన్నారు. గిరిజనులు సంప్రదాయాల ప్రకారం హవానించారు వారితో కాసేపు ముచ్చ్చటించి కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాటికి వాగు కాలువలో ఓ సి పి మట్టి కొట్టుకొని వఛ్చి కాలువలు ముసుకు పోతున్నాయని మరమత్తులు చేపట్టాలని అన్నారు . తెలంగాణ మూడు తరాల ఉద్యమానికి ముందు నడిచి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ,నిధులు,నియామకాలలో జరిగిన అన్యాయాలను ఎదురించి పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రo సాదించుకున్నాము. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ విధానాన్ని తొలగించి నిరోద్యుగులకు ఉపాధి కల్పించేలా భూ అంతర గనులను ప్రోత్సహించి నిర్వహించాలి . అలాగే సింగరేణి యాజమాన్యం పరిసర ప్రాంత గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇ.చంద్రశేఖర్, టి.వి.వి. ఎల్ రమేష్ , మిట్ట దేవేందర్ , ఉపాధ్యాయులు, విద్యార్ధి సంఘల నాయకులూ, మేధావులు తదితరులు పాల్గొన్నారు.
అత్యాచార నిందితుడు అరెస్టు
అత్యాచార నిందితుడు అరెస్టు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో గత 27న మేనకోడలి పై అమానుషంగా అత్యాచారం కు పాలుపడిన నిందితుడుని నిన్న సాయంత్రం తన ఇంటివద్దనే పట్టుకొని అరెస్టు చేసినట్లు డిఎస్పీ రమణ రెడ్డి తెలిపారు. గురువారం నాడు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ గత 27న కిష్టాపూర్ గ్రామం ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంటి పక్కనున్న తన మేనకోడలు పై బలవంతంగా అత్యాచారం చేసిన నిందితుడు మేనమామ పై యువతి తల్లిదండ్రులు పిర్యాదు మేరకు పొలుసులు పూర్వాపరాలను పరిశీలించి నిందితున్ని కస్టడీలోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రమణ రెడ్డి , సిఐ కరుణాకర్ , ఎస్ ఐ సురేష్ ఉన్నారు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో గత 27న మేనకోడలి పై అమానుషంగా అత్యాచారం కు పాలుపడిన నిందితుడుని నిన్న సాయంత్రం తన ఇంటివద్దనే పట్టుకొని అరెస్టు చేసినట్లు డిఎస్పీ రమణ రెడ్డి తెలిపారు. గురువారం నాడు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ గత 27న కిష్టాపూర్ గ్రామం ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంటి పక్కనున్న తన మేనకోడలు పై బలవంతంగా అత్యాచారం చేసిన నిందితుడు మేనమామ పై యువతి తల్లిదండ్రులు పిర్యాదు మేరకు పొలుసులు పూర్వాపరాలను పరిశీలించి నిందితున్ని కస్టడీలోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రమణ రెడ్డి , సిఐ కరుణాకర్ , ఎస్ ఐ సురేష్ ఉన్నారు
Subscribe to:
Posts (Atom)