ఎయిర్ హోస్టెస్‌ని వాడుకోండి... కోపైలెట్ ఆఫర్!
విమానం ఆలస్యమైనందుకు ఆగ్రహించవద్దని, ఎయిర్ హోస్టెస్‌ను వాడుకోమని ప్రయాణికులకు దారుణమైన ఆఫర్ చేశాడో పైలెట్. లయన్ ఎయిర్ ఫ్లయిట్‌లో బాలీకి వెళ్తున్నవారికి ఈ విచిత్ర అనుభవం ఎదురైంది. ఆ విమానం జావా ద్వీపం నుంచి ఆలస్యంగా బయల్దేరడంతో ప్రయాణికులు మండిపడ్డారు. వారిని శాంతిపజేయడానికి కోపైలెట్ ఈ నీచమైన ఆలోచన చేశాడు. విమానం ఆలస్యంగా బయల్దేరినందుకు చింతిస్తున్నామని, మీరు కావాలంటే మా ఎయిర్ హోస్టెస్‌ను వాడుకోవచ్చని ప్రకటించాడు. అప్పటికే కాక్‌పిట్ లోపలి నుంచి మూలుగుతున్న శబ్దాలు వినిపించాయి. దీంతో లాంబెర్టస్ అనే ప్రయాణికుడికి కోపం తన్నుకొచ్చింది. కో పైలెట్ వ్యహారంపై అతడు రవాణా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశాడు. విమానం ఆలస్యం అయితే ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్‌లను ఆఫర్ చేయడం లయన్ ఎయిర్ సంస్థ అనుసరిస్తున్న విధానమా? అని నిలదీశాడు.
విమానం ల్యాండ్ కాగానే కోపైలట్‌ను పట్టుకునేందుకు ప్రయాణికులంతా విఫలయత్నం చేశారు. మరోవైపు లాంబెర్టస్ ఫిర్యాదుపై లయన్ ఎయిర్ అధికారులు స్పందించారు. ఆ కో పైలట్‌పై విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఆ పైలెట్‌ను సస్పెండ్ చేశారు.
No comments:
Post a Comment