Sunday, 8 November 2015

వర్గీకరణ సాధనకు మరో పోరాటం

వర్గీకరణ సాధనకు మరో పోరాటం 

  
ఎస్సీల వర్గీకరణ సాధనకు మరో పోరాటం  చేయాల్సిన  అవసరం ఎంతైనా ఉందని ఎం అర్ పీ ఎస్ జిల్లా ఇంచార్జ్ అర్ . రామచంద్రం మాదిగ అన్నారు . శనివారం రెబ్బెనలో ఆయన విలేకర్లతో  మాట్లాడారు.  కె సి అర్ ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారని,  ఆయన మాదిగలు చేసే డిమాండ్లు న్యాయపరమైనవని ఆయన అన్నారు.దలిథులకు 3 ఎకరాల సాగు భూమి ,డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసారని అన్నారు. కె సి అర్ కు మాదిగలపై చిత్తశుద్ది ఉంటె అఖిలపక్ష బృందాన్ని డిల్లి కి పంపి పార్లమెంటులో వర్గీకరణ చట్టబద్దత కల్పించి ఆయన నిజయతిని నిరూపించు కోవాలని ఆయన అన్నారు. లేని పక్షములో మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెఛరించారు. ఈ నెల 15న ఎం అర్ పి ఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆసిఫాబాద్ కు వస్తున్నారని, ఈ సభకు మాదిగలు , విద్యార్థులు , మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు ,ఈ కార్య క్రమమములో ఎం అర్ పి ఎస్ నాయకులూ నారాయణ, వెంకటేష్ మాదిగ, రాజందర్ మాదిగ, బొంగు నరసింగరావు మాదిగ, వెంకటి మాదిగ, రాజు మాదిగ  తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment