. జ్యోతీరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి
బీసీల ఆశాజ్యోతి బాపూజీరావు పూలే 125వ జయంతి సందర్బంగా ఆశయ సాధనకు బీసీలంతా ఐకమత్యంగా కృషి చేయాలని రెబ్బెన ఐక్య సంఘర్షణ సమితి అన్నారు. శనివారం మహాత్మా జ్యోతీరావు పూలే వర్దంతి సందర్భంగా రెబ్బెన మండల కేంద్రంలోని అతిదీగ్రుహ ఆవరణలో పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, బిసిల సమస్యలు పరిష్కరించటానికి కలెక్టర్, మంత్రులు చొరవ చూపాలన్నారు. వసతిగృహాల్లో పూలే విగ్రహాలు ఏర్పాటుచేయాలని, పూలే బిసిభవన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కడతల మల్లయ్య, బోగే ఉపేందర్, మోడెం సుదర్శన్ గౌడ్, రాజ గౌడ్, గోడిసేలా వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment