Tuesday, 17 November 2015

ప్రభుత్వ పాటశాల పారిశుద్ధ్య కార్మికులను నియమించాలి

ప్రభుత్వ పాటశాల  పారిశుద్ధ్య కార్మికులను  నియమించాలి


ఎలాంటి అంక్షలు ,షరతులు  లేకుండా ప్రభుత్వ పాటశాల  పారిశుద్ధ్య కార్మికులను  నియమించాలని రెబ్బెన తహసిల్దార్ కు అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఎ,అయ్,ఎస్,ఎఫ్) నాయకులు వినతి పత్రాన్ని అందించారు. ఎ,అయ్,ఎస్,ఎఫ్ రెబ్బెన మండల కార్యదర్శి పుదారి సాయి కిరణ్ మాట్లాడుతూ  సర్వశిక్ష అభియాన్  పథకం ద్యారా యం.పి.పి , యం.పీ.యు.పీ.యస్ , జడ్పి.యస్.యస్ లలో  కొన్ని షరతులు,విదానాలు  పెట్టి ప్రభుత్య పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తున్నట్లు  ప్రకటించారు . కాని దీని ద్యారా మన మండలంలోని పాటశాల లు లబ్ధికి నోచుకోవు. కావున  ప్రైవేటు పాటశాలలకు దీటుగా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఎ,అయ్,ఎస్,ఎఫ్ ఆద్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని పాటశాలల న్ని అభివృద్ధి పరచాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎ,అయ్,ఎస్,ఎఫ్ మండల ఉప కార్యదర్శ  మలిశెట్టి మహిపాల్,  మండల సహాయ కార్యదర్శి వేమునూరి శేఖర్, నాయకులు జె. సాయి,  ఎం. సాయి, వెంకటేష్, రాయిల్ల నర్సయ్య విద్యార్థులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment