రెబ్బెనలో ఘనంగా రాజీవ్ ఖేల్ రత్న అభియాన్
(రెబ్బెన వుదయం ప్రతినిధి);
రాజీవ్ ఖేల్ రత్న అభియాన్ పోటీలు శనివారం రెబ్బెన మండ కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పోటిలలో మండలం లోని అన్ని పాటశాలల విద్యార్థిని విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ పోటిలలో వివిధ క్రీడలు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ నిర్వహించగా విద్యార్థులు చక్కని ఆటతీరుతో తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ పోటిలలో గెలుపొందిన విద్యార్థులకు యం.పి.డి.ఓ యం.ఎ అలీమ్ భాహుమతులు ప్రధానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో రెబ్బెన యం.పి.డి.ఓ మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక వికాసాన్ని అందించే క్రీడలకుకవలసిన ప్రోస్తహకలను కల్పించటానికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో డిప్యుటి తహశీల్దార్ రామ్మోహన్ రావు, ఎస్ ఐ టి వి రావు , యం ఈ ఓ వెంకటేశ్వర్లు. ఏ పి యం రాజ్ కుమార్, నవీన్ జైస్వాల్, చిరంజీవి, పెసరు వెంకటమ్మ, మదునయ్య తదితర అధికారులు పాల్గొన్నారు
ప్రోటోకాల్ పాటించని అధికారులు
రాజీవ్ గాంధి ఖేల్ అభియాన్ పోటిలలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని మండల కో ఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని అన్నారు. ఈ పో టీ లకు వచ్చిన విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో అధికార్లువిఫలమయ్యారని అన్నారు. పోటీలకు తయారు చేసిన మైదానాన్ని చదును కూడా చేయలేదని అన్నారు.
No comments:
Post a Comment