ఇందిరా గాంధీ 98వ జయంతి వేడుక
(రెబ్బెన వుదయం ప్రతినిధి) మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 98 వ జయంతి వేడుకలను ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో రెబ్బెన మండల కేంద్రంలోని గురువారం పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.జన్మదిన కేక్‌ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎన్,ఎస్,యు,ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ మాట్లాడుతూ. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జాతీయ స్థాయిలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఆ వర్గాల అభ్యున్నతికి పాటుపడినట్లు, జమిందారి వ్యవస్థ రద్దు, బ్యాంకుల జాతీయకరణ, బడుగు, బలహీన వర్గాలకు భూమి మంజూరు తదితర చర్యలు ఆమె పాలనలో జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ దళిత, గిరిజన, బలహీన వర్గాల సామాజిక వర్గ ప్రజల్లో ఆమె చెరగని ముద్ర వేసుకొన్నట్లు ఆయన ఇందిరాగాంధీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుర్గం హన్ముతు నాయకులు మండల అధ్యక్షుడు నదీం, పట్టణ అధ్యక్షుడు అబ్బు, సంజీవ్, ముజ్జ,సాయి, వినోద్,వివేక్,మొరలి,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment