Saturday, 21 November 2015

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు



(రెబ్బెన వుదయం ప్రతినిధి);  48వ గ్రంథాలయ వారోత్సవాలు రెబ్బెనలోని  గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాలు 
శుక్రవారం ఈ వారోత్సవాల ముగింపు సందర్భంగా వారం రోజులుగా  నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా  జడ్పిటిసి బాబురావు  మాట్లాడుతూ పుస్తకపఠనం మేథాశక్తిని పెంచుతుందని ప్రాచీన గ్రంథాలు పురాణ పురుషుల యొక్క జీవితాలను ఈ పుస్తక పఠనం ద్వారా నేర్చుకోవచ్చునని అన్నారు. పుస్తకాలను చదువుకొని ఎంతో విజ్జానాన్ని సంపాదించుకోవచ్చన్నారు. ఈ వారోత్సవాల సందర్బంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారి స్వర్ణలత, తహశిల్దార్ రమేష్ గౌడ్, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, సుదర్శన్ గౌడ్, తూర్పుజిల్లా ప్రధాన కార్యదర్శి శంకరమ్మ, పలు పాఠశాలల పాటశాల ఉపాధ్యాయులతోపాటు  విద్యార్థులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment