విద్యార్థులకు సామాగ్రి పంపిణి
విద్యార్థులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటేనే ప్రతిభావంతులు అవుతారనే ఉద్దేశ్యంతో రెబ్బెనకు చెందిన వ్యాపారి నటరాజ్ మరియి వస్రం నాయక్ (గ్రీన్ హెల్త్ ఫౌండేషన్) రెబ్బెన మండలంలోని పులికుంట ప్రభుత్వ పాటశాల విద్యార్థులకు ఉచితంగా ప్యాడ్లు, పెన్నులు, పుస్తకాలు, అలాగే పాటశాల ప్రధానోపాధ్యాయుడు టీ, శ్రీనివాస్ గుర్తింపు కార్డులు, టై, బెల్టులు, మరియి హరితహరంలో భాగంగా పచ్చదనమే ప్రగతికి మూలాధారం అని భావించి ప్రధానోపాధ్యాయుడు టీ, శ్రీనివాస్ పాటశాల ఆవరణలో మొక్కలు నాటారు, వాటికి గ్రామ ప్రజలు కంచెను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వెంకటేశ్వర స్వామి, సర్పంచ్ సుశీల, ఎంపిటిసి కొవ్వూరి శ్రీనివాస్, పాటశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment