Sunday, 22 November 2015

పర్యవేక్షణ లోపంతో ఇబ్బందులు ఎదురుకుంటున్న వసతిగృహ విద్యార్థులు

పర్యవేక్షణ లోపంతో ఇబ్బందులు ఎదురుకుంటున్న వసతిగృహ విద్యార్థులు

  • రెగ్యులర్ వార్డేన్లను కేటాయించాలి. 


 (రెబ్బెన వుదయం ప్రతినిధి); నవంబర్,22.  రెబ్బెన మండల కేంద్రంలోని బి.సి మరియు ఎస్సి వసతి గృహం లో విద్యార్థుల మనుగడ పర్యవేక్షణ లోపంతో ఇబ్బందులు ఎదురుకుంటున్న వసతిగృహం ప్రమాదకరంగా మారిందని టి.డి.పి మండల అద్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్ అన్నారు. ఆదివారం ఉదయం రెబ్బెన  బి.సి మరియు ఎస్సి వసతి గృహంను సందర్శించటానికి వెళ్ళగా అక్కడ ఈ  దుస్థితి చూసి వాపోయానన్నారు. బి సి  వసతిగృహం లో 22మంది విద్యార్థులు వుండగా వాళ్ళ  సంరక్షణకై నియమితులైన వార్డెన్ శ్రీనివాస్ నెలకు  ఒకసారి వచ్చి వెళ్తారని,  అలాగే ఎస్సి వసతి గృహం లో 18మంది వుండగా వార్డెన్ సంజీవన్  మూడు రోజులకు ఒకసారి వచ్చి వెళ్తారని విద్యార్థులు వివరించారు అన్నారు. వసతిగృహం లో అవసరానికి నోచుకోని 6మరుగుదొడ్లు, ఒక  స్నానపు గది  వున్నాయి. విద్యార్థులు తమ అవసరాలను తీర్చుకోవటానికి బయటికి వెళ్ళవలసి వస్తుందని, రాత్రి  వేలాల్లో బయటికి వెళ్ళాలంటే భయంగా వుందని విద్యార్థులు తమగోడును తనతో వేల్లదిన్చారన్నారు.  విద్యార్థులు స్నానం చేయటానికి మోటారు పాడవటంతో నీళ్ళ వసతి లేక  పోవటంతో చేతిపంపు క్రింద స్నానం ఆచరించే దుస్థితి నెలకోందని వాపోయారు. ఇలా బయట స్నానం ఆచరించటం తో నీరు నిల్వ వుండి  దోమలు తయారవటం తో  దీనికి తోడు వసతి గృహంలో  ఫ్యాన్లు పనిచేయకపోవటంతో  విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతిని అనారోగ్యపాలవుతున్నారని  అన్నారు. తెరాస ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన  పేదపిల్లల పట్ల వివక్షత చూపుతుందని, రెగ్యులర్ వార్డేన్లను కేటాయించాలని.తగు సమందిత అధికారులు కుమ్మకై మంజురైన నిధులను కూడా  స్వాహా చేసి వసతిగృహాలకు  ఈ దుర్గాతిని పట్టించారని ఈ సందర్భంగా  అన్నారు.  

No comments:

Post a Comment