ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలి
(రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణ ప్రభుత్వం మైనార్టిలకు 12% రిజర్వేషన్ కల్పించాలని రెబ్బెన టిడిపి జిల్లా మైనారిటి సెల్ కార్యదర్శి జాకీర్ ఉస్మాని అన్నారు ఆదివారం మాట్లాడుతూ తెలంగాణా అధికారంలోకి రాక ముందు ఎన్నకల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేటి వరకు కమిటీలు వేసి సమయం వృధా చేసి రిజర్వేషన్ మాత్రం కల్పించడం లేదని అన్నారు. ముస్లిం మైనార్టీ సామాజిక వర్గాలకు విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో 12శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టి సక్రమంగా అమలు చేయాలని అన్నారు. మైనార్టిలపై సవతి తల్లి ప్రేమ చూపట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నెరవేర్చడం లేదని, వెంటనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి అమలు చేయాలని కోరారు.
No comments:
Post a Comment