Thursday, 5 November 2015

65వ రోజుకు చేరుకున్న ఆశాకార్యకర్తల సమ్మె


65వ రోజుకు చేరుకున్న ఆశాకార్యకర్తల సమ్మె





రెబ్బెన ;; తమ న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని రెబ్బనలో  హెల్త్ వర్కర్స్ (ఆశ కార్యాకర్తలు)  ఈ సందర్భంగా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ నేటి సమాజంలో పెరుగుతున్న కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువులకు అనుగుణంగా ప్రభుత్వం తమ వేతనాలను పెంచాలని, లేదంటే తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారై వీధుల పాలవుతాయని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, రెబ్బెన ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు ఆశ కార్యాకర్తల సమ్మె నేటికి 65 రోజులు అవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాకపోవడం విడ్దూరంగా ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యాక్రమంలో , సుకన్య,  పద్మ, సరోజన, భాగ్య  ఆశ కార్యాకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment