ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వం
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రానికి 108 అంబులెన్సు వాహనం లేక పోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎన్,ఎస్,యు,ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ అన్నారు. శనివారం రెబ్బెనలోని ప్రభుత్వ కళాశాల ముందు శనివారం రోజున ఎన్,ఎస్,యు,ఐ నాయకులు మండల కేంద్రానికి 108 అంబులెన్సు కేటాయించాలని కళాశాల విద్యార్థులు మరియు ఎన్,ఎస్,యు,ఐ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మండల కేంద్రానికి 108 వాహనం కేటాయించిన దానిని కొన్ని కారణాల వలన తాండూర్ కు తరలించారని దీంతో రెబ్బెన మండల కేంద్రంలో 108 అంబులెన్సు లేక ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర పరిస్థితులలో ప్రైవేటు అంబులెన్సులను ఆశ్రయిస్తున్నారని, గతంలో ఈ విషయం గురించి ఎమెల్యే కోవా లక్ష్మికి తెలుపగా చర్యలు తీసుకుంటానని అన్నారు, తహశిల్దార్ రమేష్ గౌడ్ కు వినతి పత్రం కూడా అందజేశారు. ఇలా ఎన్ని సార్లు వినతీ పత్రాలు అధికారులు పట్టించుకోవడం లేదని, ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రాణాలు కోల్పోవాలని అన్నారు. శుక్రవారం నాడు రెబ్బెనలో జరిగిన ప్రమాదంలో 108 రావడానికి రెండు గంటల తరువాత అంబులెన్సు వచ్చిందని దీంతో నంబల కు చెందినా కోట వెంకటేష్ అపస్మారక స్థితిలోకి వెల్లిపోయాడని అన్నారు. ఈ ధర్నాలో కళాశాల విద్యార్ధులు నాయకులు మండల అధ్యక్షుడు నదీం, పట్టణ అధ్యక్షుడు అబ్బు, సంజీవ్, ముజ్జ,సాయి, వినోద్,వివేక్,మొరలి,అరవింద్ తదీతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment