ఓరుగల్లులో దూసుకెళ్లిన కారు- రెబ్బెనలో నాయకులు మిటయీ లతో సంబరాలు
వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపు కోసం ఓరుగల్లు ఓటర్లు
దూసుకెళ్లి కారు గుర్తుకు ఓటేశారని టీర్‌ఎస్ పార్టీ తూర్పు జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ కుమార్
జైశ్వాల్ అన్నారు ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించి, ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పారని కేసీఆర్ సునామీకి
తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని అన్నారు. అనంతరం మండల కార్యకర్తలు మిఠాయిలు
తినిపించుకున్నారు. ఈ గెలుపుతో మరింత అభివృద్ధి చేయడానికి మాకు ఓరుగల్లు ప్రజలు బలాన్ని చేకూర్చారని,
అందుకు కృతజ్ఞతలు తెలిపారు. గులాబీ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వరంగల్ ఉప ఎన్నికలో విజయమే
నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. గులాబీ జెండానే తమకు అండగా భావించిన వరంగల్ ఓటర్లు టీఆర్‌ఎస్ పార్టీ
అభ్యర్థి పసునూరి దయాకర్‌కు రికార్డు స్థాయిలో భారీ మెజార్టీని కట్టబెట్టి గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాబురావు, ఎంపిపి కార్నాధం సంజీవ్ కుమార్, వైస్ ఎంపీపీ గోడుసేల రేణుక, మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, మహమ్మద్ జమీర్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, టి,ఆర్,ఎస్ నాయకులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment