Sunday, 31 May 2015

బడి బయటి పిల్ల్లల వివరాలు సేకరించాలి





రెబ్బెన : రెబ్బెన మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో డ్రాప్‌ అవుట్‌ విద్యార్థుల వివరాలు ఇంటింటా సర్వే చేసి సేకరించాలని మండల విద్యాధికారి, సాక్షర భారత్‌ మండల సమన్వయ కర్త సాయిబాబాలు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం వారు మాట్లాడుతూ... బడి మానేసిన పిల్ల్లల వివరాలను సేకరించాలన్నారు. రెండు రోజుల పాటు సర్వే నిర్వహించి జూన్‌ 2న సర్వే నివేదికలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచ ర్లు, సాక్షర్‌ భారత్‌ గ్రామ సమన్వయ కర్తలు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 30 May 2015

తెలంగాణ ఆవిర్భావదినోత్సవల్లో మహిళలకు ఆహ్వాణం


తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న మహిళలందరు జూన్ 2 న  తెలంగాణ ఆవిర్భావదినోత్సవ సంబరాలలో అందరు అదిక సంఖ్య లో పాల్గొనాలని  జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి  కుందారపు శంకరమ్మ  రెబ్బెన మండలం లోని గోల్లేటి గ్రామా పంచాయతి లో జరిగిన ప్రెస్ మీట్  లో ఆమె వెల్లడించారు  ఆమె మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు   ఎన్నో పతకాలను ప్రభుత్వం అమలుచేసింది ముఖ్యంగా మహిళలకు  కళ్యాణ లక్ష్మి, మిషన్ ఇంద్రధనస్సు, దళిత బస్తి, మిషన్ కాకతీయ  లాంటివి  ఎన్నో   పతకాలను మన మహిళల కోసం ప్రవేశపెట్టారు.  ఈ కార్యక్రమం లో   టౌన్  అధ్యక్షురలు  బోయిని  శంకరమ్మ ,  ఉపధ్యక్షురలు రమ , రావగుండం  తార  , సౌమ్య ,కౌసల్య  తదితర మహిళలు పాల్గొన్నారు .   

Friday, 29 May 2015

తెలంగాణ మన వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు



(రెబ్బెన వుదయం  ప్రతినిధి, మే 29 ):  మండలంలోని రైతులు పంట మార్పిడి వల్ల అధిక లాభాలు పొందవచ్చని, సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వాడి సరైన సమయంలో విత్తనాలు ఎవో మంజుల అన్నారు. రెబ్బన గ్రామ పంచాయతీలో శుక్రవారం మన తెలంగాణ మన వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విత్తన శుద్ది చేసి విత్తుకోవాలని, పంటల మార్పిడి వల్ల దిగుబడులు పెరుగుతాయన్నారు. వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటమ్మ, వైస్‌ ఎంపీపీ రేణుక, ఏఈఓ మార్క్‌, పశు వైద్యాధికారి సాగర్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ మదనయ్య, పంచాయతి కార్యదర్శి రవీందర్‌, రైతులు పాల్గొన్నారు. 

రెబ్బెన : మండలంలోని నేతగాని కులస్తులు తహసీల్దార్‌ కార్యాలయంలో వారి యొక్క కులం పేరు కుల నివాసన పత్రాల లో కులం పేరు సరిగ్గా రాకుండా నేతా అని వస్తుందని డిప్యూటీ తహసీల్దార్‌ రాంమోహన్‌కు వినతి పత్రం అందజేశారు. సంఘం గౌరవ అధ్యక్షులు దుర్గం హనుమంతులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మొండయ్య, ఉపాధ్యక్షుడు లింగయ్య, దుర్గం భరద్వాజ్‌, మున్యం రవి తదితరులు పాల్గొన్నారు. - See more at: 

ఎంసెట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంక్‌ సాధించిన మానస



రెబ్బెన : మండల కేంద్రానికి చెందిన బారిశెట్టి మానస ఎంసెట్‌లో 463వస్థానం సాధించి రాష్ట్రస్థాయిలో నిలిచింది. ఒకటో తరగతి నుంచి కాగజ్‌నగర్‌ ఫాతిమా కాన్వెంట్‌లో8వ తరగతి చదివి, 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు శ్రీచైతన్య హైదరాబాద్‌లో చదివి ఎంసెట్‌లో రాణించింది. ఈసందర్భంగా మానస రాష్ట్రస్థాయిలో ప్రతిభనబర్చినందుకు ఆమె తల్లిదండ్రులు బారిశెట్టి శ్రీనివాస్‌, శారదలు, ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Thursday, 28 May 2015

కార్మికుల శ్రమ దోచుకుంటున్న ప్రభుత్వం

రెబ్బెన : మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లో కెఎల్‌ మహేంద్ర భవన్‌లో కార్మికుల సమావేశం గురువారం నిర్వహించారు. ఎఐటీయూసీ కోల్‌బెల్టు ఏరియా ఇంచార్జి భానుదాస్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్‌ చేయాలని, కార్మికులను తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మెలో పాల్గొన్నారని, రాష్ట్ర ఆవిర్బావంలో పాల్గొన్నారని, ఇప్పుడు కెసీఆర్‌ ప్ర భుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈకార్యక్రమంలో జోగి ఉపేందర్‌, రామస్వామి, అశోక్‌, తదితర నాయకులు పాల్గొన్నారు 

Wednesday, 27 May 2015

రెబ్బెన మండలంలో కూరగాయల ధరలు

  1.  

(కిలో.. రూ.లలో)
                                 గత వారం  ధర                                              ఈవారం ధర

టమాట రూ.                 20                                                                  30
వం కాయ రూ.              20                                                                  35
బిరకాయ రూ.               30                                                                  40 
పచ్చి మిర్చి రూ.           30                                                                   40
గొరిచిక్కుడు కాయ రూ. 30                                                                   40
సిమ్లామిర్చి రూ.            40                                                                   60
అలచెంతకాయ రూ.        30                                                                  40
బెండకాయ రూ.             20                                                                  35 
దొండకాయ రూ.             30                                                                  40
క్యారేట్‌ రూ.                    30                                                                  40
బీట్‌రూట్‌ రూ.                30                                                                  40
కాకరకాయ రూ.             20                                                                 35
దొసకాయ రూ.               20                                                                  30
సోరకాయ రూ.               20                                                                  30
అలుగడ్డలు రూ.             15                                                                  20
ఉల్లి గడ్డలు రూ.              18                                                                  20
కొతిమీర రూ.                  60                                                                  80
మునిగకాయలు రూ.       30                                                                 40

కూరగాయల వ్యాపారి  ఎజాజ్


రెబ్బెన మండలంలో  ఎక్కువ ఎండలతో కూరగాయలు దిగుబడి లేక కూరగాయల ధర లు గత వారానికి  ఈ  వారానికి సరిచుసుకుంటే ధరలు ఎక్కువగా వుండటం వలన  రే ట్లు పెంచి అమ్మవలసివస్తుందనికూరగాయాలు ఎక్కువ ధర పెట్టి తీసుకొని వచ్చి అవి అమ్ముడుపోక పడపోయావలసి వస్తుందని  కూరగాయల వ్యాపారి  ఎజాజ్  తెలిపారు.


కూరగాయల  ధరలు ఎక్కువగా వుండటం  వలన సాధారణంగా పప్పు ఉప్పు లతో రోజులు గడిపెసుకుంటూ జీవిస్తున్నామని కూరగాయలు కొనుటకు వచ్చిన  దత్తు , సుమలత , లక్ష్మి లు మరియు ప్రజలు వాపోతున్నారు .



రేపు కాంట్రాక్టు కార్మికుల సమావేశం

రెబ్బెన : మండల కేంద్రంలోని గోలేటిటౌన్‌షిప్‌లో గురువారం కెఎల్‌ మహేంద్రభవనంలో కార్మికులు సమావేశం నిర్వహించడం జరుగుతుందని జెఐపీయూసీ అధ్యక్షుడు ఉప్పoదర్‌ తెలిపారు. ముఖ్య అతిధులుగా నాయకులు తిరుపతి, పాన్‌దాస్‌లు ముఖ్య అతిధులుగావస్తారని కార్మికులు ఎక్కువ సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

వాటర్‌ ట్యాంకు బాగు చేయండి


రెబ్బెన : మండలంలో గంగాపూర్‌ గ్రామ పంచాయతీలో వాటర్‌ ట్యాంకు గత ఏడు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉందని, ప్రభుత్వాలు మారిన బోరు మాత్రం బాగుపడటం లేదని, ఈ ఎండకాలంలో భూగర్బజలాలు అడుగంటడంతో చేతి పంపుల్లో నీరు రావడం లేదని , నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు, మహిళలు, వార్డు మెంబర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయిం చి గ్రామంలో తాగునీటి కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.

వేడికి బయటకు రాని జనం

రెబ్బెన : మండలంలో ప్రజలు ఉష్ణోగ్రతల కారణంగా ఇళ్లలో నుంచి బయటకు వెళ్లడం లేదు. ఎండల తీవ్రత వల్ల వ్యాపారులకు లాభం తగ్గిందని వ్యాపారస్థులు అన్నారు. రోడ్ల న్ని నిర్మానుష్యంగా మాాంయి. 

Tuesday, 26 May 2015

ప్రశాంతంగా ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు


రెబ్బెన: మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టీయర్‌ సప్లమెంటరీ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షకు 39 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 38 మంది హాజరయ్యారు. ఇంటర్‌ సెకండియర్‌లో ముగ్గ ురుకి ముగ్గురు హాజరయ్యారని చీఫ్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

చెరువు పనులు నాసిరకం



రెబ్బెన : మండలంలోని ధర్మారం శివారులో ఉన్న నల్లమల చెరువు పనులు నాసిరకంగా ఉన్నట్లు రైతులు ఎల్‌ జయరాం, గొర్ల చంద్రయ్య , బిక్కు, మదునయ్య తెలిపారు. ఈసందర్బంగా ఎంపీపీ సంజీవ్‌ కుమార్‌, జడ్పీటీసీ బాబు రావ్‌ నాయకులు సందర్శించారు. ఇసుకమట్టితో కూడిన కంకరను చూసి నాసిరకం పనులని అన్నారు.

రైతుల సంక్షేమమే ముఖ్యం : ఎంపీపీ


రెబ్బెన : రెబ్బెన మండలంలోని గంగాపూర్‌లో మంగళవారం మన తెలంగాణ మన వ్యవసాయం యాత్రలో ఎంపీపీ సంజీవ్‌ కుమార్‌ హాజరై మాట్లాడుతూ ... తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, ముఖ్యమంత్రి కెసీఆర్‌కు రైతుల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. రైతులు సేంద్రీయ ఎరువులను వాడాలని, చెరువులో తీసిన మట్టిని పంటపొలాల్లో వేసుకుని విత్తనాలు సరైన సమయంలో నాటాలని, ఈ సంవత్సరం ఎరువుల కొరత ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాబురావ్‌, సర్పంచ్‌ రవీందర్‌, వెటర్నరీ డాక్టర్‌ సాగర్‌, రవీందర్‌, తదితర నాయకులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో ఆరు దరఖాస్తులు


రెబ్బెన : మండల కేంద్రంలో మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆరు దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో అలీం తెలిపారు. ఇందులో నాలుగు ఫించన్‌లు, రెండు భూమి తగాదాలువచ్చాయని అన్నారు. ఈ సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని అన్నారు.

దరఖాస్తులకు ఆహ్వానం


రెబ్బెన : 2015 -16 దీపం పథకం కింద అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో అలీం, ఐకెపీ ఎపీఎం సుకుమార్‌ తెలిపారు. డ్వాక్రా గ్రూపుల సభ్యురాలుగా ఉండాలని, ఆహార భద్రత కార్డు కలిగిఉండాలని, ఆధార్‌ రేషన్‌ కలిగి ఉండాలని అన్నారు. అర్హత గల వారు ఈ నెలాఖరులోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.

Saturday, 23 May 2015

రెబ్బెన లో ఒకరు వడదెబ్బతో మృతి




(రెబ్బెన వుదయం  ప్రతినిధి, మే 23):తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు.  రెబ్బెన మండల కేంద్రం లోని రాల్లపేట కు చెందినా లావుడ్యా హరిసింగ్ (52) ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాల్లపేట నుండి సింగల్ గూడా కు వస్తూ వడదెబ్బ తో సింగల్ గూడా లో వంతులు విరోచనాలు కావడం తో మృతి చెందాడు.  
కరెంట్ షాక్ తో ఒకరు మృతి: మండలం లోని గంగాపూర్ గ్రామంలో కొత్తగుర్లె హన్మంతు  తన వ్యవసాయ భూమిలో విద్యుత్ మోటార్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి అక్కడిక్కడ చనిపోయాడు.    




Friday, 22 May 2015

వాహనాల తనిఖీ


రెబ్బెన మండల కేంద్రంలో శుక్రవారం పోలీసుస్టేషన్‌ ప్రధాన రహదారి వద్ద వాహనాలను రెబ్బెన ఎస్సై హనుఖ్‌ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైసెన్సులు లేనివారు వాహనాలు నడుపరాదని, వాహన పత్రాలు లేకుండా ప్రయాణం చేస్తే జరిమానాలు విధించడం జరుగుతుందని ఆయన అన్నారు. మద్యంసేవించి వాహనాలను నడుపరాదని ఆయన అన్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

Thursday, 21 May 2015

ఆంధ్రప్రభ యాప్‌ను ప్రారంభించిన తహసీల్ధార్‌


రెబ్బన: తాజా విశేషాలను యాప్‌ ద్వారా ప్రజలకు మరింతలో చేరవేసే భృహత్తర కార్యక్రమాన్ని ఆంధ్రప్రభ చేపట్టడం అభినందనీయమని తహసీల్ధార్‌ జగదీశ్వరి తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఆమె ఆంధ్రప్రభ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్ధార్‌ మాట్లాడుతూ... స్థానిక వార్తలను సైతం యాప్‌ ద్వారా ప్రజలకు మరింత చెరువ చేయడంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో యాప్‌ను ప్రవేశ పెట్టడం శుభ పరిణాయమన్నారు. ఎప్పటికప్పుడు తాజా వార్తలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ముందుకెళ్లాలని ఆకాంక్షీంచారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రభ యాప్‌ను ప్రారంభించిన మండల విద్యాధికారి



రెబ్బెన: మండల విద్యా వనరుల కేంద్రంఓ మండల విద్యాధికారి మహేశ్వర్‌ రెడ్డి ఆంధ్రప్రభ యాప్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాజావార్తలను అనుక్షణం అప్‌డేట్స్‌ చేస్తూ వార్తలను అందజేయడం బాగుందని, ఇలాగే ఇంకా ముందంజలో వార్తలను అందిస్తూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్‌, ఖాదర్‌, కుమార్‌, ఆంధ్రప్రభ ప్రతినిధులు పాల్గొన్నా

ఆంధ్రప్రభయాప్‌ను ప్రారంభించిన ఎస్సై


రెబ్బెన : మండలంలో ఆంధ్రప్రభయాప్‌ను రెబ్బెన ఎస్సై సిహెచ్‌ హనుఖ్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తాజా వార్తలు చూసుకునేందుకువీలుగా అందరికి అందుబాటులో ఉన్న యాప్‌ను ప్రారంభించడం చాలా అభినందనీయమని ఆయన అన్నారు. మెరుపువేగంతో పనిచేసే ఈ ఆంధ్రప్రభ యాప్‌ ఇంక ముందుకెళ్లాలని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైటర్‌ సారయ్య, హెడ్‌కానిస్టేబుల్‌ బి. శ్రీనివాస్‌, ఆంధ్రప్రభ ప్రతినిధులు పాల్గొన్నారు. 

తీవ్ర ఎండా తో ఇబ్బంది పడుతున్న ప్రజలు



(రెబ్బెన వుదయం  ప్రతినిధి, మే 21) రెబ్బెన పట్టణంలో ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు, కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు తమతమ విధులకు హాజరుకావాలంటే భయపడుతూ హాజరవుతూ నరక యాతన పడుతున్నారు.మండలలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ంది. ప్రజలకు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. దానికి తోడుగా మధ్యమధ్యలో కరెంటు కోతలు ఉండటంతో ఎండవేడిమి తట్టుకోలేక ఇంటివద్ద ఉన్న గృహిణీలు, చిన్నపిల్లలు ఉక్కపోతకు గురవుతున్నారు.

ప్రభుత్వపాఠశాలలో రేషనలైజేషన్‌ విరమించుకోవాలి



(రెబ్బెన వుదయం  ప్రతినిధి, మే 21): రెబ్బెన మండలంలోని తెలంగాణ విద్యార్థి వేదిక బుధవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కడ్తల సాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల రేషనలైజేషన్‌ పేరుతో పాఠశాలలను మూసివేసే చర్యలను మానుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రేషనలైజేషన్‌ వల్ల పాఠశాలలు మూతపడి విద్యార్థులు వీదిన పడే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులతో పాటు ఇతర పోస్టులను బర్తీ చేసి వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయనకోరారు. 

పట్టణంలో ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు, కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు తమతమ విధులకు హాజరుకావాలంటే భయపడుతూ హాజరవుతూ నరక యాతన పడుతున్నారు. దానికి తోడుగా మధ్యమధ్యలో కరెంటు కోతలు ఉండటంతో ఎండవేడిమి తట్టుకోలేక ఇంటివద్ద ఉన్న గృహిణీలు, చిన్నపిల్లలు ఉక్కపోతకు గురవుతున్నారు.

Monday, 18 May 2015

గుడిపేట13వ బెటాలియన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛ భారత్‌



(రెబ్బెన వుదయం  ప్రతినిధి, మే 18) రెబ్బెన మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 13వబెటాలియన్‌ 150మంది సిబ్బంది, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు అందరు కలిసి సోమవారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుభ్రం చేశారు. కరెంటు వైర్ల పనులు, రంగులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బోర్డులను రాశారు. గుడిపేట కమాండర్‌ చక్రధర్‌ మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ గురించి అవగాహన కోసం పోలీసులు ఈవిధంగా స్వచ్చభారత్‌ చేస్తున్నామని, ప్రతిఒక్కరు స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని అన్నారు. ఈకార్యక్రమంలో సిఐ యశ్వంత్‌ రాజ్‌, నాగానాయక్‌, సీఐ నాగేంద్ర, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్‌ సరస్వతీ, ఎస్సై కిరణ్‌, ఎస్సై బాబురావ్‌, రెబ్బెన ఎస్సై సిహెచ్‌ హనుక్‌, పోలీసుసిబ్బంది, బెటాలియన్‌ అధికారి డాక్టర్‌ సంతోష్‌ సింగ్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

(రెబ్బెన వుదయం  ప్రతినిధి, మే 18) రెబ్బెన మండల కేంద్రంలోని అంతరాష్ట్ర రహదారి పై ఆదివారం అర్ధరాత్రి సుమారు 12గం. టాటా ఇండికా మరియు ఇన్నోవా వాహనములు ఎదురేదురగా వచ్చి డీకోన్నాయి. బెల్లంపల్లి నుండి ఆసిఫాబాద్ వెళ్తున్న ఎ.పి.29 బీ.ఎస్. 2898 నం. గల టాటా ఇండికా కారు ఎదురగా కాగజ్ నగర్ నుండి మంచిర్యాల వెళ్తున్న ఇన్నోవా క్రొత్త వాహనం ను డీకోట్టింది, ఇన్నోవా వాహనం లో ప్రయాణిస్తున్న మంచిర్యాల వాసి చెట్ల సతీష్ (36)  అక్కడిక్కడే మృతిచెందాడు, ఇతడు కాగజ్ నగర్ లోని ఒక  పెండ్లి రేసిప్సన్ కు వెళ్లి వస్తూ మృత్యు వాత పడ్డాడాని,  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు  రెబ్బెన ఎస్.ఐ. హనుక్ తేలిపారు

ఎప్పుడూ పెట్రోల్‌ నిల్‌


రెబ్బెన : మండలంలోని ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌లో ఎప్పుడు వెళ్లిన నోస్టాక్‌ బోర్డు దర్శనమివ్వడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంక్‌కు వచ్చిన పెట్రోల్‌ను బ్లాక్‌లో ప్రైవేటు వ్యక్తులకు క్యాన్‌లలో పోస్టూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాదారులు వేరే గత్యంతరం లేక అధిక ధర చెల్లించిన పెట్రోల్‌ను కొనుగోలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Saturday, 16 May 2015

మినీ మహానాడును విజయవంతం చేయాలి


రెబ్బెన : మండలం నుండి తెదేప కార్యకర్తలు ఈ నెల 17 ఆదివారము నాడు మంచిరియాల లోని యం ఎన్ అర్      ( గద్దరేగాడి)  గార్డెన్ లో  జరుగు ఆదిలాబాద్ తూర్పు జిల్లా స్తాయి  మినీ మహానాడు కు భారి సంఖ్య  లో హాజరై విజయవంతం చేయాలని  రెబ్బెన మండల  తెదేప అధ్యక్షుడు మోడేం సుదర్శన్ గౌడ్  విలేకరుల సమావేశం లో పిలుపునిచ్చాడు ఈ సమావేశం లో  బొంగు నర్సింగరావు , పొగాకు నవీన్ , గొడిశెల భార్గవ్ గౌడ్ , రాజాగౌడ్ ,  కస్తూరి మహేష్ , నాగరాజు మరియు తదితరా కార్యకర్తలు పాల్గొన్నారు.     

Wednesday, 13 May 2015

లక్ష్మిపూరం సమ్మక్క-సారక్క దేవస్థానం 2వ వార్శికోత్సవం



(రెబ్బెన వుదయం  ప్రతినిధి, మే 13):  రెబ్బెన మండలం లోని లక్ష్మిపూరం గ్రామ మునందు గల సమ్మక్క సారక్క దేవస్తానం నిర్మించి 2 సంవత్సరముల పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆలయ పూజారి పిప్పిరి తుకారం ను ఆలయ కమిటి అధ్యక్షులు శ్రీనివాస్, గంగాపూర్  గ్రామా సర్పంచ్ రవీందర్ మరియు నాగయ్య లు ఘనంగా సన్మానిచారు, అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్ధ ప్రసదలతో పటు అన్నదానం ఏర్పాటు చేసారు, ఈ కార్యక్రమం లో ఆలయ కమిటి మెంబర్స్ మరియు  భరీగా  భక్తులు  పాలుగోన్నారు సమ్మక్క సారక్క దేవతల ఆస్సీసులు పొందారు. 

రెబ్బెన లో ఎన్.టి.అర్. విగ్రహాన్ని పగలగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు






రెబ్బెన, మే12(వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రంలోని బస్సు స్టాండ్ వద్ద గల ఎన్.టి.అర్. విగ్రహాన్ని సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విగ్రహం ముక్కు మరియు చేయి ని విరోగ్గోట్టారు, దీంతో మండలంలోని తెదపా నాయకులూ రాష్ట్ర రహాదరి మీద రాస్తా రోకో చేసి ఈ ఘటన కు కారకులైన వ్యక్తులను పట్టుకొని కటినంగా శిక్షించాలని సిర్పూర్ నియోజికవర్గం ఇంచార్జ్ రావి శ్రీనివాస్ ఎస్.ఐ. హనుక్ ను కోరారు, ఈ కార్యక్రమం లో మండల తెదపా అధ్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్, తెదపా జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, రెబ్బెన గ్రామా ఉప సర్పంచ్  శ్రీదర్ బొమ్మినేని, అజయ్ జేస్వాల్, సురేష్ జైస్వాల్, బొంగు నరసింగరావు, మద్ది శ్రీనివాస్, బార్గవ్ గౌడ్, జాకీర్, నవీన్ తదితరులు పాలుగోన్నారు . 




  

మిషన్ కాకతీయ పనులను పరివేక్షించిన ఎమ్.పి.డి.ఓ.



రెబ్బెన, మే12(వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు ను మిషన్ కాకతీయ లో బాగంగా పునురుద్దరించు కార్యక్రమంలో సోమవారం రోజున పనుల పరివేక్షించి చెరువు కట్ట పనుల నాణ్యత ను పరిశీలించిన రెబ్బెన మండల ఎమ్.పి.డి.ఓ. ఆలిం, ఈ కార్యక్రమం లో కో ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ మదనయ్య, వార్డ్  మెంబర్ చిరంజీవి పాలుగోన్నారు.

రజక కులస్తుల ను గ్రామా బహిష్కరణ చేసినవారిని



రెబ్బెన, మే12(వుదయం ప్రతినిధి): కాగజ్ నగర్ మండలంలోని హరేగూడ గ్రామా పరిదిలో గల 17 రజక కుటుంబాలు తమకు  వారం లో ఒక రోజు సెలవు కావాలని అడిగినందున,  హరేగూడ కు చెందినా అరె మరియు ఇతర కులస్తులు కలిసి  17 రజక కుటుంబాలను  గ్రామా బహిష్కరణ చేసి వారికి సహాయనిరాకరణ మరియు వారిని బట్టలు ఉతకడానికి పిలవడం లేదు అని అటువంటి వారిని కటినంగా శిక్షించాలని వారు రెబ్బెన మండల తహసిల్డారుకు వినతి పత్రం సమర్పిస్తూ కోరారు, ఈ కార్యక్రమంలో రజక కుల రాష్ట్ర నాయకులూ కడ్తాల మల్లయ్య, మండల రజక కుల సంఘం అధ్యక్షులు రామడుగుల శంకర్, జిల్లా నాయకులూ చంద్రగిరి శ్రీనివాస్, రాచకొండ రమేష్, పొదిలి రంగయ్య, తిరుపతి, రాములు పాలుగోన్నారు.  

Sunday, 10 May 2015

గుర్తుతెలియని వాహనం డీకోని ఒకరు మృతి 

రెబ్బన మండలంలో ఆదివారం తెల్లవారిజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో దుర్గం రాజు (38) ద్విచాక్రవానంపై పులికుంట నుండి రెబ్బెన కు తన అన్నయ్య కొడుకు పెల్లి పనుల నిమ్మిత్తం వెళ్ళుతుండగా పల్లవిబ్రిడ్జ్, బొగ్గు డంపింగ్ యార్డ్ వద్ద  గుర్తుతెలియని వాహనం డీకొట్టడం తో రాజు అక్కడిక్కడే మరణించాడు, మృతదేహాన్ని  పోస్టుమార్టం కొరకై బెల్లంపల్లి ఆసుపత్రి కి తరలించడం జరిగిందని రెబ్బెన ఎస్.ఐ . సి.హెచ్  హనోక్  తెలిపారు .  

Wednesday, 6 May 2015

పలు డిమాండ్ల సాధనకై నిరహరదిక్ష చేప్పట్టిన సి.పి.ఐ. పార్టీ కార్యకర్తలు


రెబ్బెన, మే 6 (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రం లో సి.పి.ఐ. పార్టీ నాయకులూ, కార్యకర్తలు నిరాహార దీక్ష చెప్పట్టారు, పలు సమస్యల పరిష్కారం కొరకు జిల్లా వ్యాప్తంగా సాముహిక ధర్నాలు, నిరాహార దీక్షలు చెప్పట్టింది, వారు రెబ్బెన మండల తహసిల్దారుకు పలు డిమాండ్లు ఉన్న  మెమొరాండం ను సమర్పించారు, ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్ట్ పనులు తుమ్మిదిహెట్టి నుండే కొనసాగించాలని, ప్రాదాన్యత క్రమంలో తూర్పు ఆదిలాబాద్ జిల్లా లోని అన్ని నియోజికవర్గాలకు 1,66,000 ల ఎకరాల భూములకు సాగు నీరు ప్రజలకు త్రాగు నీరు అందిచాలి, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక భూ సేకరణ అర్దినేన్సును వెంటనే ఉపసంహరించాలని, దీర్ఘకాలంగా అడవి భూములలో సాగు చేస్తున్న గిరిజన,దళిత, బలహీన వర్గాల రైతులకు భూ యాజమాన్య హక్కు లు కలిపించాలి, ప్రభుత్వం సిర్పూర్ పేపర్ మిల్లు ను వెంటనే తెరిపించి, కార్మికుల ప్రాణాలను కాపాడాలి, చనిపోయిన కార్మికుల కుటుంబలకు 10 లక్షల ఎక్ష్ గ్రేషియా చెల్లించాలి, తెరాస ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిర్ణిత సమయలోగా యుద్దప్రథిపాదిగా అమలుజరపాలని సి.పి.ఐ. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అయినటువంటి ఎస్. తిరుపతి తెలిపారు, ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ జాది గణేష్, గోలేటి పట్టణ కార్యదర్శి బి. జగ్గయ్య కత్తెర శాల పోషం, ఎమ్.సత్యనారాయన, రాయిల్ల నర్సయ్య, దుర్గం రవీందర్ బోగి మల్లయ్య, డి.ఈశ్వర్  తదితర నాయకులూ పాలగోన్నారు 

ఆర్‌టీసీ కార్మికుల సమ్మెతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు


రెబ్బెన, మే 6 (వుదయం ప్రతినిధి): ఆర్‌టీసీ కార్మికుల సమ్మెతో డిపోలోనే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెబ్బెన నుండి ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి  వెళ్ళలంటే ఆటోలను ఆశ్రయించవలసి వస్తుంది. రోజు నిన్నటిదాక ఉన్న ఆటో చార్జిలు నేడు ఆర్‌టిసి సమ్మెతో మూడింతలు పెంచారు ప్రయాణికులు వాపోతున్నారు. బుధవారం వివహ శుభాకార్యాలు అధికంగా ఉండటంతో ప్రయాణీకులు చేసేదిఏమి లేక ఆటో వాల్లు అడిగిన కాడికి చార్జిలు చెల్లించి ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తాత్కలికంగా ఆర్‌టిసి బస్సులు నడిపేటట్లు చర్యలుతీసు కోవాలని పలువురు ప్రయాణీకులు కోరుచున్నారు

Saturday, 2 May 2015

వేకువజామున లారి కలకలం




రెబ్బన మండలంలో శనివారం రోజున ప్రధాన  రహదారి గుండా వెళ్తున్న లారి నం. ఎపి29u2579 లైన్ బండి ఇనుప లోడ్ తో వెళ్ళే లారి రోడ్ కి 30 ఫీట్ దూరంలో ఉన్న 3 షాపులను  ద్వంసం చేసినది. మొదట రోడ్ పక్కనే ఉన్న చెట్టు కొమ్మను  తగిలి, రోడ్ పక్కన  ఉన్న మోటార్ సైకిల్ మెకానిక్ మల్లేష్ షాపు ముందు ఉన్నరేకుల షడ్డుకు డీకొట్టి  పక్కషాపు దుర్గారావు లారి గ్యరెజిలో చొరబడి పక్కనే ఉన్న శ్రీరాజేశ్వర వెల్డింగ్ వర్క్స్ షాపులోకి దుసుకేల్లింది. స్థానికులు చెప్పిన ప్రకారంగా రాత్రి 3 గంటల సమయంలో జరిగింది. రోడ్ పక్కనే పెద్ద శబ్దం రావడంతో మెకానిక్ మల్లేష్ వచ్చిచూడగా,లారి ఇరుక్కు పోయి ఉన్నది అని లారి చూసినానని చెప్పాడు. డ్రైవర్, క్లీనర్ పరారిలో ఉన్నారు. సంఘటన తెల్లవారుజామున జరగటం వలన ప్రాణ నష్టం జరగలేదు కాని ఆస్థి నష్టం జరిగింది.  

ఘనంగా జరిగిన మేడే వేడుకలు

రెబ్బెన మండలంలోని మేడే సందర్భంగా ఎడవెల్లి గ్రామంలో శుక్రవారం  నాడు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా సీపీఐ మండల సహాకార్యదర్శి ముల్యం బుద్దజీ జెండాను

 ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జాడి గణష్‌ హజరై 

మాట్లాడుతూ నేడు కార్మిక హక్కుల దినం కావడంతో కార్మికుల హక్కులకై పొరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

 కార్యక్రమంలో జాడి తిరుపతి, నారాయణ, ఎడవెల్లి గ్రామ సహాయ కార్యదర్శి దుర్గం గోపాల్‌ పాల్గొన్నారు.  

రెబ్బెన మండలంలోని ఘనంగా జరిగిన మేడే వేడుకలు


రెబ్బెన మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ

మండల కార్యదర్శి శంకర్‌ జెండావిష్కరించారు. అనంతరం కార్మికుల హక్కుల దినోత్సవం కాబట్టి కార్మికుల

హక్కులకై పోరాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు కార్యదర్శి, జిల్లా ఉపాధ్యక్షులు ఉపేంధర్‌,

 ఎఐవైఎఫ్‌ మండల కార్యదర్శి సంతోష్‌, ఎఐవైఎఫ్‌ ఆసిఫాబాద్‌ డివిజన్‌ కార్యదర్శి, పెద్దయ్య, గణష్‌, శంకర్‌లు

పాల్గొన్నారు

వడదెబ్బతాకిడికి ఒక వ్యక్తి మృతి

 రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామపంచాయితీ పరిధిలో  గురువారం నాడు ఎన్టీఆర్‌ కాలనీ కి చెందిన గొలుసుల సాయిలు (65) అనే వ్యక్తి పనికి వెళ్లి తిరిగి వచ్చే టప్పుడు మార్గమద్యంలో  వాంతులు చేసుకుని పడిపోయాడు గమనించిన  కుమారుడు సాయిలు తండ్రి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.