Sunday, 29 November 2015

మాల మహానాడు మండల కమిటి ఎన్నిక

మాల మహానాడు మండల కమిటి ఎన్నిక


 (రెబ్బెన వుదయం ప్రతినిధి); రాష్ట్ర అధ్యక్షతన ఆదివారం నాడు రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో మాల మహానాడు కార్యక్రమంలో కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకునారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాష్ట్ర కార్యదర్శి సొల్లు లక్ష్మి, అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు సత్తయ్య, దుర్గం సోమయ్య, నియోజకవర్గ ఇంచార్జ్ సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్, బండి శ్యాం, రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ కల్పించాలి


(రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణ ప్రభుత్వం మైనార్టిలకు 12% రిజర్వేషన్ కల్పించాలని రెబ్బెన టిడిపి జిల్లా మైనారిటి సెల్ కార్యదర్శి జాకీర్ ఉస్మాని అన్నారు ఆదివారం మాట్లాడుతూ తెలంగాణా అధికారంలోకి రాక ముందు ఎన్నకల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేటి వరకు కమిటీలు వేసి సమయం వృధా చేసి రిజర్వేషన్ మాత్రం కల్పించడం లేదని అన్నారు.  ముస్లిం మైనార్టీ సామాజిక వర్గాలకు విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో 12శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టి సక్రమంగా అమలు చేయాలని  అన్నారు. మైనార్టిలపై సవతి తల్లి  ప్రేమ చూపట్టి  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నెరవేర్చడం లేదని, వెంటనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి అమలు చేయాలని కోరారు.

ఘనంగా తెలంగాణా దీక్షా దివస్

ఘనంగా తెలంగాణా దీక్షా దివస్



(రెబ్బెన వుదయం ప్రతినిధి)రెబ్బెన మండల కేంద్రంలో తెరాసా ఆధ్వర్యంలో తెలంగాణా దీక్షా దివస్ కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ఆమరణ నిరహరదీక్ష వల్లనే తెలంగాణ సిద్దించిందని జడ్పిటిసి బాబురావు అన్నారు. ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఆరుదశాబ్ధాలుగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో అప్పటి ప్రభుత్వం ఏ మాత్రం చలించలేదన్నారు. మలి ఉద్యమంలో

 కేసిఆర్‌ మొదలుపెట్టి 2009 నవ ంబర్‌ 29న ఆమరనిరహర దీక్ష చేపట్టారన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 

మరుసటి నెల డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన చేసిందని గుర్తుచేశారు. ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఏర్పాటు 


కారణంగా ఉద్యమాలు చేశారన్నారు. కొందరు మావల్లే తెలంగాణ వచ్చిందని ప్రచారం చేయడం పరిపాటిగా 


మారిందన్నారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే 


తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మొదటివరుసలోనిలిచిన ఘనత కేసిఆర్‌కే దక్కిందన్నారు. ముఖ్యంగా సాగు, 


తాగునీరు, విద్యా, సంక్షేమ పథకాలు, బీడి, గీతా, చేనేత కార్మికులకు కూడా పెన్షన్‌ కల్పించడంలో టీఆర్‌ఎస్‌ 


ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. ఇన్ని చేసినా కూడా ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదన్నారుఈ కార్యక్రమంలో , ఎంపిపి కార్నాధం సంజీవ్ కుమార్, వైస్ ఎంపీపీ గోడుసేల రేణుక, అన్ని గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు, జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైశ్వాల్, మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, మహమ్మద్ జమీర్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, టి,ఆర్,ఎస్ నాయకులు పాల్గొన్నారు..

Saturday, 28 November 2015

జ్యోతీరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి

జ్యోతీరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి
  
(రెబ్బెన వుదయం ప్రతినిధి)
బీసీల ఆశాజ్యోతి బాపూజీరావు పూలే 125వ జయంతి సందర్బంగా ఆశయ సాధనకు బీసీలంతా ఐకమత్యంగా కృషి చేయాలని రెబ్బెన ఐక్య సంఘర్షణ సమితి అన్నారు. శనివారం మహాత్మా జ్యోతీరావు పూలే వర్దంతి సందర్భంగా రెబ్బెన మండల కేంద్రంలోని అతిదీగ్రుహ ఆవరణలో పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, బిసిల సమస్యలు పరిష్కరించటానికి కలెక్టర్‌, మంత్రులు చొరవ చూపాలన్నారు.  వసతిగృహాల్లో పూలే విగ్రహాలు ఏర్పాటుచేయాలని, పూలే బిసిభవన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కడతల మల్లయ్య, బోగే ఉపేందర్, మోడెం సుదర్శన్ గౌడ్, రాజ గౌడ్, గోడిసేలా వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినికి గాయాలు

విద్యార్థినికి గాయాలు

(రెబ్బెన వుదయం ప్రతినిధి)


రెబ్బెన మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో పుంజుమేరగూడకు చెందిన ఆదే అంజలి(6వ తరగతి) స్కార్పియో వాహనం తగలడంతో స్వల్పగాయాలయ్యాయి.  గుర్తు తెలియని స్కార్పియో వాహనం ఆపకుండా వెళ్ళడంతో     విద్యార్ధి నాయకులు రవీందర్,రాజేష్ నంబల ఎం ఫై టి సి శ్రీనివాస్  చాకచక్యంతో పోలీసులకు సమాచారం అందించడంతో కాగజ్ నగర్ లో పట్టుబడ్డాడు. దీంతో విద్యార్థినికి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు.

రెబ్బెనలో ఘనంగా రాజీవ్‌ ఖేల్‌ రత్న అభియాన్‌



రెబ్బెనలో ఘనంగా
 రాజీవ్‌ ఖేల్‌ రత్న అభియాన్‌ 



(రెబ్బెన వుదయం ప్రతినిధి); 
రాజీవ్‌ ఖేల్‌ రత్న  అభియాన్‌ పోటీలు శనివారం  రెబ్బెన మండ కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పోటిలలో మండలం లోని అన్ని పాటశాలల విద్యార్థిని విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ పోటిలలో వివిధ క్రీడలు  వాలీబాల్‌, ఖోఖో,  కబడ్డీ నిర్వహించగా విద్యార్థులు చక్కని ఆటతీరుతో తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ పోటిలలో గెలుపొందిన విద్యార్థులకు యం.పి.డి.ఓ  యం.ఎ అలీమ్ భాహుమతులు ప్రధానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో రెబ్బెన  యం.పి.డి.ఓ మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక వికాసాన్ని అందించే క్రీడలకుకవలసిన ప్రోస్తహకలను కల్పించటానికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో డిప్యుటి తహశీల్దార్ రామ్మోహన్ రావు, ఎస్ ఐ  టి వి రావు , యం ఈ ఓ  వెంకటేశ్వర్లు. ఏ పి యం రాజ్ కుమార్, నవీన్ జైస్వాల్, చిరంజీవి,  పెసరు వెంకటమ్మ,  మదునయ్య  తదితర అధికారులు పాల్గొన్నారు

ప్రోటోకాల్ పాటించని అధికారులు 

రాజీవ్ గాంధి ఖేల్ అభియాన్ పోటిలలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని మండల కో ఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని  అన్నారు. ఈ  పో టీ లకు  వచ్చిన విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో అధికార్లువిఫలమయ్యారని  అన్నారు. పోటీలకు తయారు చేసిన మైదానాన్ని చదును కూడా చేయలేదని అన్నారు.  

Friday, 27 November 2015

వారసత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి.

                           వారసత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి.

 (రెబ్బెన వుదయం ప్రతినిధి); బెల్లంపల్లి ఏరియలోవారసత్వ ఉద్యోగాలు సాదించాలని ఎస్.ఎస్.ఎ అద్యక్షుడు  మొర్లె  నరేందర్ అన్నారు. రెబ్బెన మండలలోని గోలేటి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 29 న జరిగే రామకృష్ణాపూర్ లోని  సరస్వతి శిశుమందీర్లో  మహా సదస్యు  నిర్వహిస్తున్నట్లు తెలిపారు . 1998 రద్దయిన వారసత్వ ఉద్యోగపు హక్కును తిరిగి కల్పించాలని  ,కార్మికుల వయస్సు పెరుగుతున్న కొద్ది సంస్థ లక్ష్యం పెరుగుతుంది కానీ కార్మికుల సమస్యలకు పరిష్కారం లేకుండా పోతుందని, మనహక్కుకై మనమే పోరాడాలని, కార్మికుల వారసులు అధీ క సంఖ్యలో పాల్గొని కరీంనగర్ మరియు ఆదిలాబాద్ మహా సదస్యును విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమములో మాస్కు రమేష్,అశోక్, గబ్భాల తిరుపతి, నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.   

జిల్లాను కరువు ప్రాంతముగా ప్రకటించలి

ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతముగా ప్రకటించలని తహసిల్దార్కి  వినతి. 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); తేలుగు దేశం పార్టి నాయకులు మరియు యం  అర్ పి ఎస్ నాయకులు  డ్యూప్యుటి తహసిల్దార్ కి ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతముగా ప్రకటించాలని శుక్రవారము రోజున రెబ్బెన మండలం తహసిల్దార్ కార్యాలయములో వినతి పత్రమును అందజేసారు అనంతరము వారు మాట్లాడుతు ఆదిలాబాద్ జిల్లాలో సరైన వర్షాభావ పరస్థితి లేక రైతులు వేసుకున్న పంటలు పండక అప్పుల బాధలతో సతమతమయుతున్నారు దానికి తోడు ఋనమాఫీ ఒకే దఫ లో చెల్లించక రైతులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు కావున ఇప్పటికైన ప్రభుత్వము మేలుకొని ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతముగా గుర్తించి కేంద్రానికి పంపించి నివేదికలో ఆదిలాబాద్ జిల్లాను పొందుపరచి నష్టపోయిన రైతులకు వడ్డీ ఋణమాఫీలు చెల్లించాలి మరియు చర్యలు తీసుకోవాలి అని అన్నారు ఈ కా ర్యకరమములొ తేదేపా మండల అద్యక్షులు మోడం సుదర్శన్ గౌడ్ తేదేపా ప్రధాన కార్యదర్శి అజయ్ జేశ్వాల్ తేదేపా సినియర్ నాయకులు మోడం రాజగౌడ్ మరియు యమ అర్ పి ఎస్ మండల అద్యక్షులు బొంగు నర్సింగరావు, యమ అర్ పి ఎస్ నాయకులు గోగార్ల తిరుపతి ఎ.ఐ.ఎస్.ఎఫ్. నాయకులు గోగార్ల రాజేష్ తదితరులు పలుగొన్నరు.

పూలె అంబేత్కర్ ఆశయ సాధనలో విద్యార్ధులు నడవాలి - టి.వి.వి

పూలె అంబేత్కర్ ఆశయ సాధనలో విద్యార్ధులు నడవాలి - టి.వి.వి 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); తెలంగాణ విద్యార్ధి వేదిక టి వి వి విద్యాహక్కు కోసం ఉద్యమించిన మహాత్మ జ్యోతి రావు పులే బాబాసాహెబ్  అంబేద్కర్ ల స్పూర్తి తో విద్యా వ్యాపరికరణ కాశాయికరణకు వ్యతిరేకంగా పోరాడాలని తెలంగాణ విద్యార్ధి వేదిక టి వి వి పిలుపునిస్తుందని జిల్లా అద్యాక్షులు కడతల సాయి అన్నారు శుకురవరం రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పూలె అంబేత్కర్ వర్ధంతుల సందర్బంగా విద్యార్దులతో సదస్సు  నిర్వహించారు సదస్సులో వారు మాట్లాడుతూ భారతదేశంలోని వేల సంవత్సరాలుగా విద్యా నిరాకరిమ్చబడిన విదిత కులాలకు మహిళలకు జ్ఞన ద్వరాలు పూలె ద్వారా  తెరువబడ్డాయి. అందరికి సమాన విద్యాహక్కు కోసం శాస్త్రియ విద్యావిధానం కోసం ఉద్యమాన్ని నడిపిన పూలె అంబేద్కర్ ల ఆశయ సాధన విద్యార్దులు నడవాలని పిలుపునిచ్చారు ఈసదస్సులో తెలంగాణ విద్యార్ధి వేదిక మండల అధ్యక్షులు పార్వతి సాయి, డివిజన్ నాయకులు సాయి నవతేజ, జిల్లా కార్య వర్గ సబ్యులు ప్రణయ్ , నాయకులూ సతీష్, హరీష్ కళాశాల అద్యక్షులు పున్నం, విద్యార్ధులు పలుగోన్నారు. 

Wednesday, 25 November 2015

ఆంధ్రా బ్యాంకులో పట్టాభి సీతారామయ్య 136 జయంతిని ఘనంగా వేడుకలు

ఆంధ్రా బ్యాంకులో పట్టాభి సీతారామయ్య 136 జయంతిని ఘనంగా వేడుకలు

రెబ్బెనలోని ఆంధ్రా బ్యాంకులో పట్టాభి సీతారామయ్య 136 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ సైదులు మాట్లాడుతూ శ్రీ పట్టాభి సీతారామయ్య ఒక లక్షతో  1923 లో  మొదలెట్టి, ఇప్పుడు లక్ష కోట్లతో 2700 బ్రాంచులతో, 3153 ఎటిఎం లతో ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు క్యాషియర్ వగ్గు ఆనంద్ కుమార్, అజ్మెర రమేష్, మధనయ్య, రాజేశ్వర్, ప్రకాష్ అగర్వాల్, ఖాతాదారులు సునీల్ చౌదరి, గందె సాయి కిరణ్, దీకొండ సంజీవ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఓరుగల్లులో దూసుకెళ్లిన కారు- రెబ్బెనలో నాయకులు మిటయీ లతో సంబరాలు

 ఓరుగల్లులో దూసుకెళ్లిన కారు- రెబ్బెనలో నాయకులు మిటయీ లతో సంబరాలు

వరంగల్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ గెలుపు కోసం ఓరుగల్లు ఓటర్లు 

దూసుకెళ్లి కారు గుర్తుకు ఓటేశారని టీర్‌ఎస్‌ పార్టీ తూర్పు జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ కుమార్

జైశ్వాల్ అన్నారు ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి, ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పారని కేసీఆర్‌ సునామీకి

 తెదేపా, బీజేపీ, కాంగ్రెస్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిందని అన్నారు. అనంతరం మండల కార్యకర్తలు మిఠాయిలు 

తినిపించుకున్నారు. ఈ గెలుపుతో మరింత అభివృద్ధి చేయడానికి మాకు ఓరుగల్లు ప్రజలు బలాన్ని చేకూర్చారని,

అందుకు కృతజ్ఞతలు తెలిపారు. గులాబీ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వరంగల్‌ ఉప ఎన్నికలో విజయమే 

నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. గులాబీ జెండానే తమకు అండగా భావించిన వరంగల్‌ ఓటర్లు టీఆర్‌ఎస్‌ పార్టీ 

అభ్యర్థి పసునూరి దయాకర్‌కు రికార్డు స్థాయిలో భారీ మెజార్టీని కట్టబెట్టి గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాబురావు, ఎంపిపి కార్నాధం సంజీవ్ కుమార్,  వైస్ ఎంపీపీ గోడుసేల రేణుక,  మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, మహమ్మద్ జమీర్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, టి,ఆర్,ఎస్ నాయకులు పాల్గొన్నారు.












uÉ\¢+|Ÿ*¢ d¾+>·¹sDì m]jáÖýË“ ¿±]ˆ£Å£”\ k忱sÁ«sÁÆ+ MT ¿ÃdŸ+ MT €sÃ>·«+ nHû ¿±sÁ«ç¿£eÖ“ “sÁÇV¾²dŸTïq•³T¢ uÉ\¢+|Ÿ*¢ m]jáÖ › jáT+ ¿ sÁ$Xø+¿£sY nH•sÁT. ¿±]ˆÅ£”\ Å£”+³T+‹\Å£” yîTsÁTÂ>Õq yîÕ<óŠ«+ n+~+#\Hû kÍ<ŠT<ûÝXø+ÔÃ
‡ ¿±sÁ«ç¿£eÖ“• “sÁÇV¾²dŸTïq•³T¢ Ôî*bÍsÁT. ™VÕ²<Šsu²<Ž ýË“ eÖ©¼ ™dàwŸ©{ì €dŸÎçÜýË“ ç|ŸeTTK yîÕ<óŠ«+ “|ŸÚDT\
Ôà ‡ ¿±sÁ«ç¿£eÖ“• “sÁÇ V¾²dŸTïq•³T¢ Ôî*bÍsÁT. ‡ Hî\ 30 Ôî~ qT+& &™d+‹sY 5e Ôî~ esÁÅ£” ‡ ¿±sÁ«ç¿£eÖ“• “sÁÇVŸ²D –+³T+<‘“ Ôî*bÍsÁT ¿±eÚq ¿±]ˆÅ£”\ Å£”+³T+‹\T kÍœ“¿£ d¾+>·¹sDì ndŸÎçÜ q+<ŠT ™|sÁT¢ qyîÖ<ŠT #ûdŸT¿Ãe\“ nH•sÁT. yûTÈsY €sÃ>·« dŸeTdŸ«ýÉÕq ¿±]¦jáÖ\›dŸTï , ÈqsÁýÙ dŸsÁ¨HŽ ý²+{ì ×<ŠT sÁ¿±\ º¿ìÔáà\Å£” dŸ+‹+~+ºq yîÕ<Š«“|ŸÚDT\T n+<ŠTu²³TýË –+{²sÁ“ nH•sÁT.‡ ¿±sÁ«ç¿£eT+ýË |ŸsÁàqýÙ yûTHûÈsY ºÔáïsÁ+ÈHŽ, &yîÕ|¾myŽT bÍýËZq•sÁT.

Sunday, 22 November 2015

పర్యవేక్షణ లోపంతో ఇబ్బందులు ఎదురుకుంటున్న వసతిగృహ విద్యార్థులు

పర్యవేక్షణ లోపంతో ఇబ్బందులు ఎదురుకుంటున్న వసతిగృహ విద్యార్థులు

  • రెగ్యులర్ వార్డేన్లను కేటాయించాలి. 


 (రెబ్బెన వుదయం ప్రతినిధి); నవంబర్,22.  రెబ్బెన మండల కేంద్రంలోని బి.సి మరియు ఎస్సి వసతి గృహం లో విద్యార్థుల మనుగడ పర్యవేక్షణ లోపంతో ఇబ్బందులు ఎదురుకుంటున్న వసతిగృహం ప్రమాదకరంగా మారిందని టి.డి.పి మండల అద్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్ అన్నారు. ఆదివారం ఉదయం రెబ్బెన  బి.సి మరియు ఎస్సి వసతి గృహంను సందర్శించటానికి వెళ్ళగా అక్కడ ఈ  దుస్థితి చూసి వాపోయానన్నారు. బి సి  వసతిగృహం లో 22మంది విద్యార్థులు వుండగా వాళ్ళ  సంరక్షణకై నియమితులైన వార్డెన్ శ్రీనివాస్ నెలకు  ఒకసారి వచ్చి వెళ్తారని,  అలాగే ఎస్సి వసతి గృహం లో 18మంది వుండగా వార్డెన్ సంజీవన్  మూడు రోజులకు ఒకసారి వచ్చి వెళ్తారని విద్యార్థులు వివరించారు అన్నారు. వసతిగృహం లో అవసరానికి నోచుకోని 6మరుగుదొడ్లు, ఒక  స్నానపు గది  వున్నాయి. విద్యార్థులు తమ అవసరాలను తీర్చుకోవటానికి బయటికి వెళ్ళవలసి వస్తుందని, రాత్రి  వేలాల్లో బయటికి వెళ్ళాలంటే భయంగా వుందని విద్యార్థులు తమగోడును తనతో వేల్లదిన్చారన్నారు.  విద్యార్థులు స్నానం చేయటానికి మోటారు పాడవటంతో నీళ్ళ వసతి లేక  పోవటంతో చేతిపంపు క్రింద స్నానం ఆచరించే దుస్థితి నెలకోందని వాపోయారు. ఇలా బయట స్నానం ఆచరించటం తో నీరు నిల్వ వుండి  దోమలు తయారవటం తో  దీనికి తోడు వసతి గృహంలో  ఫ్యాన్లు పనిచేయకపోవటంతో  విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతిని అనారోగ్యపాలవుతున్నారని  అన్నారు. తెరాస ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన  పేదపిల్లల పట్ల వివక్షత చూపుతుందని, రెగ్యులర్ వార్డేన్లను కేటాయించాలని.తగు సమందిత అధికారులు కుమ్మకై మంజురైన నిధులను కూడా  స్వాహా చేసి వసతిగృహాలకు  ఈ దుర్గాతిని పట్టించారని ఈ సందర్భంగా  అన్నారు.  

Saturday, 21 November 2015

ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వం

ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వం


(రెబ్బెన వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండల కేంద్రానికి 108 అంబులెన్సు వాహనం లేక పోవడంతో రోడ్డు  ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎన్,ఎస్,యు,ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ అన్నారు. శనివారం రెబ్బెనలోని ప్రభుత్వ కళాశాల ముందు శనివారం రోజున ఎన్,ఎస్,యు,ఐ నాయకులు మండల కేంద్రానికి 108 అంబులెన్సు కేటాయించాలని కళాశాల విద్యార్థులు మరియు  ఎన్,ఎస్,యు,ఐ  నాయకులు ధర్నా చేశారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ గతంలో మండల కేంద్రానికి 108 వాహనం కేటాయించిన దానిని కొన్ని కారణాల వలన తాండూర్ కు తరలించారని దీంతో రెబ్బెన మండల కేంద్రంలో 108 అంబులెన్సు లేక ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర పరిస్థితులలో ప్రైవేటు అంబులెన్సులను ఆశ్రయిస్తున్నారని, గతంలో ఈ విషయం గురించి ఎమెల్యే కోవా లక్ష్మికి తెలుపగా చర్యలు తీసుకుంటానని అన్నారు,  తహశిల్దార్ రమేష్ గౌడ్ కు వినతి పత్రం కూడా అందజేశారు. ఇలా ఎన్ని సార్లు వినతీ పత్రాలు అధికారులు పట్టించుకోవడం లేదని, ఇంకా ఎన్ని రోజులు ఇలా  ప్రాణాలు కోల్పోవాలని  అన్నారు. శుక్రవారం నాడు రెబ్బెనలో జరిగిన ప్రమాదంలో 108 రావడానికి  రెండు గంటల తరువాత అంబులెన్సు వచ్చిందని దీంతో నంబల కు చెందినా కోట వెంకటేష్  అపస్మారక స్థితిలోకి వెల్లిపోయాడని అన్నారు. ఈ ధర్నాలో కళాశాల విద్యార్ధులు   నాయకులు మండల అధ్యక్షుడు నదీం, పట్టణ అధ్యక్షుడు అబ్బు, సంజీవ్, ముజ్జ,సాయి, వినోద్,వివేక్,మొరలి,అరవింద్ తదీతరులు పాల్గొన్నారు.

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు



(రెబ్బెన వుదయం ప్రతినిధి);  48వ గ్రంథాలయ వారోత్సవాలు రెబ్బెనలోని  గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాలు 
శుక్రవారం ఈ వారోత్సవాల ముగింపు సందర్భంగా వారం రోజులుగా  నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా  జడ్పిటిసి బాబురావు  మాట్లాడుతూ పుస్తకపఠనం మేథాశక్తిని పెంచుతుందని ప్రాచీన గ్రంథాలు పురాణ పురుషుల యొక్క జీవితాలను ఈ పుస్తక పఠనం ద్వారా నేర్చుకోవచ్చునని అన్నారు. పుస్తకాలను చదువుకొని ఎంతో విజ్జానాన్ని సంపాదించుకోవచ్చన్నారు. ఈ వారోత్సవాల సందర్బంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారి స్వర్ణలత, తహశిల్దార్ రమేష్ గౌడ్, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, సుదర్శన్ గౌడ్, తూర్పుజిల్లా ప్రధాన కార్యదర్శి శంకరమ్మ, పలు పాఠశాలల పాటశాల ఉపాధ్యాయులతోపాటు  విద్యార్థులు  పాల్గొన్నారు.

Friday, 20 November 2015

ఎయిర్ హోస్టెస్‌ని వాడుకోండి... కోపైలెట్ ఆఫర్!

ఎయిర్ హోస్టెస్‌ని వాడుకోండి... కోపైలెట్ ఆఫర్! 

విమానం ఆలస్యమైనందుకు ఆగ్రహించవద్దని, ఎయిర్ హోస్టెస్‌ను వాడుకోమని ప్రయాణికులకు దారుణమైన ఆఫర్ చేశాడో పైలెట్. లయన్ ఎయిర్‌ ఫ్లయిట్‌లో బాలీకి వెళ్తున్నవారికి ఈ విచిత్ర అనుభవం ఎదురైంది. ఆ విమానం జావా ద్వీపం నుంచి ఆలస్యంగా బయల్దేరడంతో ప్రయాణికులు మండిపడ్డారు. వారిని శాంతిపజేయడానికి కోపైలెట్ ఈ నీచమైన ఆలోచన చేశాడు. విమానం ఆలస్యంగా బయల్దేరినందుకు చింతిస్తున్నామని, మీరు కావాలంటే మా ఎయిర్ హోస్టెస్‌ను వాడుకోవచ్చని ప్రకటించాడు. అప్పటికే కాక్‌పిట్‌ లోపలి నుంచి మూలుగుతున్న శబ్దాలు వినిపించాయి.  దీంతో లాంబెర్టస్ అనే ప్రయాణికుడికి కోపం తన్నుకొచ్చింది. కో పైలెట్ వ్యహారంపై అతడు రవాణా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశాడు. విమానం ఆలస్యం అయితే ప్రయాణికులకు ఎయిర్‌ హోస్టెస్‌లను ఆఫర్‌ చేయడం లయన్ ఎయిర్ సంస్థ అనుసరిస్తున్న విధానమా? అని నిలదీశాడు.
 
విమానం ల్యాండ్ కాగానే కోపైలట్‌ను పట్టుకునేందుకు ప్రయాణికులంతా విఫలయత్నం చేశారు. మరోవైపు లాంబెర్టస్ ఫిర్యాదుపై లయన్ ఎయిర్ అధికారులు స్పందించారు. ఆ కో పైలట్‌పై విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఆ పైలెట్‌ను సస్పెండ్ చేశారు.

కారుకి ద్విచక్ర వాహనం డి

కారుకి ద్విచక్ర వాహనం డి 

రెబ్బన ప్రధాన రహదారి మీదా వెళ్తున్న కారుకి ఎక్స్ రోడ్ నుంచి వస్తున్నా ద్విచక్ర వాహనం డీకొని ద్విచక్రవాహనాన్ని నడుపుతున్న కోట వెంకటేష్ [40]   తలకు గాయాలు కాగా స్థానిక రెబ్బెన
ఎస్ ఐ సురెష్  ఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వెంకటేష్ ని 108లో బెల్లంపల్లి ప్రథమ ఆసుపత్రికి చికిత్స చేయగ మెరుగయిన చికిత్స కోసం కరీంనగర్  తరలిస్తుండగా  మార్గమద్యలో మరణించినట్లు రెబ్బెన ఎస్ఐ తెలిపారు. మృతుడి నంబాలకు చెందిన కోట వెంకటేష్ కి భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Thursday, 19 November 2015

ఫిజురియంబర్స్మేంట్,స్కాలర్షిప్లను విడుదల చేయాలి -ఏ ఐ ఏఫ్ డి స్

   ఫిజురియంబర్స్మేంట్,స్కాలర్షిప్లను విడుదల చేయాలి -ఏ ఐ ఏఫ్ డి స్     

                  


  
(రెబ్బెన వుదయం ప్రతినిధి); అఖిల భారత ప్రజాతంత్ర విద్యర్థి సమాఖ్యవిద్యార్తి సంఘం నాయకులపై పెట్టినా అక్రమ కేసులు ఏత్తివేయాలి ఏ ఐ ఎఫ్ డి స్ జిల్లా అద్యక్షులు గోలేటి నాగేష్ అన్నారు రెబ్బెన మండలంలోని విశ్రాంతి భవనంలో గురువారం నాడు ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రానత్యగాలకై సాధించుకున్న మన తెలంగాణా  ముక్యమంత్రి విద్యార్థుల ఫిజురియంబర్స్మేంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయక విద్యారతి లోకానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో  ముంజం సంతోష్ ,జుమ్మిడి దీపాక్,మోహన్ శ్రీకాంత్ పాల్గొన్నారు  

ఇందిరా గాంధీ 89వ జయంతి వేడుక

ఇందిరా గాంధీ 98వ జయంతి వేడుక




          (రెబ్బెన వుదయం ప్రతినిధి) మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 98 వ జయంతి వేడుకలను ఎన్.ఎస్.యు.ఐ  ఆధ్వర్యంలో రెబ్బెన మండల కేంద్రంలోని గురువారం పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.జన్మదిన కేక్‌ను కట్‌ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎన్,ఎస్,యు,ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్  మాట్లాడుతూ. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జాతీయ స్థాయిలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఆ వర్గాల అభ్యున్నతికి పాటుపడినట్లు, జమిందారి వ్యవస్థ రద్దు, బ్యాంకుల జాతీయకరణ, బడుగు, బలహీన వర్గాలకు భూమి మంజూరు తదితర చర్యలు ఆమె పాలనలో జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ దళిత, గిరిజన, బలహీన వర్గాల సామాజిక వర్గ ప్రజల్లో ఆమె చెరగని ముద్ర వేసుకొన్నట్లు ఆయన ఇందిరాగాంధీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ దుర్గం హన్ముతు  నాయకులు మండల అధ్యక్షుడు నదీం, పట్టణ అధ్యక్షుడు అబ్బు, సంజీవ్, ముజ్జ,సాయి, వినోద్,వివేక్,మొరలి,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 17 November 2015

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి


ప్రభుత్వ పాటశాలలో నియమాలకు విరుద్ధంగా మధ్యాహ్న పథకంలో సన్న బియ్యం పెట్టకుండా దొడ్డు బియ్యాన్ని పెడుతున్నారని ఎన్,ఎస్,యు,ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్  అన్నారు. రెబ్బెన లోని నంబాల ప్రాథమిక పాటశాలకు మంగళవారం  వెళ్ళగా ఈ దుస్థితి కనిపిచిందని, విద్యార్థులకు ఇలా  చేయడం వల్ల పౌష్టికాహార లోపం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో నాయకులు మండల అధ్యక్షుడు నదీం, పట్టణ అధ్యక్షుడు అబ్బు, సంజీవ్, ముజ్జ, సాయి, వినోద్, లింగయ్య, ఎం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ పాటశాల పారిశుద్ధ్య కార్మికులను నియమించాలి

ప్రభుత్వ పాటశాల  పారిశుద్ధ్య కార్మికులను  నియమించాలి


ఎలాంటి అంక్షలు ,షరతులు  లేకుండా ప్రభుత్వ పాటశాల  పారిశుద్ధ్య కార్మికులను  నియమించాలని రెబ్బెన తహసిల్దార్ కు అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఎ,అయ్,ఎస్,ఎఫ్) నాయకులు వినతి పత్రాన్ని అందించారు. ఎ,అయ్,ఎస్,ఎఫ్ రెబ్బెన మండల కార్యదర్శి పుదారి సాయి కిరణ్ మాట్లాడుతూ  సర్వశిక్ష అభియాన్  పథకం ద్యారా యం.పి.పి , యం.పీ.యు.పీ.యస్ , జడ్పి.యస్.యస్ లలో  కొన్ని షరతులు,విదానాలు  పెట్టి ప్రభుత్య పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తున్నట్లు  ప్రకటించారు . కాని దీని ద్యారా మన మండలంలోని పాటశాల లు లబ్ధికి నోచుకోవు. కావున  ప్రైవేటు పాటశాలలకు దీటుగా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఎ,అయ్,ఎస్,ఎఫ్ ఆద్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని పాటశాలల న్ని అభివృద్ధి పరచాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎ,అయ్,ఎస్,ఎఫ్ మండల ఉప కార్యదర్శ  మలిశెట్టి మహిపాల్,  మండల సహాయ కార్యదర్శి వేమునూరి శేఖర్, నాయకులు జె. సాయి,  ఎం. సాయి, వెంకటేష్, రాయిల్ల నర్సయ్య విద్యార్థులు పాల్గొన్నారు. 

ఆశాల పోలీస్ నిర్భందం

                      ఆశాల పోలీస్ నిర్భందం 


రెబ్బెన లోని గత 75 రోజుల పాటు కొనసాగిస్తున్న ఆశాల నిరవదిక సమ్మెలో భాగంగా డివిజన్ సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదుట అన్ని మండలాల ఆశ వర్కర్ ల సబ్యులు మానవహారం నిర్వహించానున్నరన్న ముందస్తు సమాచారంతో రెబ్బన మండల పోలీసులు ఆటో లో వేల్ల్తున్న ఆశ వర్కర్ల ను కస్టడిలో కి తీసుకున్నారు , కస్టడి తీసుకునేందుకు కనీసం లేడి పోలీసులు లేఖ పోయిన కస్టడి తీసుకున్నారని ఆశ వర్కర్ల ఉప్ద్యక్షురాలు రమాదేవి అన్నారు   అమె  మాట్లాడుతూ తమ న్యయమ్యెన డిమౌండ్  కోసం పోరాడుతున్న అమ్మ లాంటి ఆశ ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తుందని అన్నారు. పోలీసులు కస్టడి లోకి తీసుకున్న వారిలో  తిరుమల , స్వప్న,స్వరూప,కవిత,నిర్మల,పలువురు ఆశ కార్యకర్తలు ఉన్నారు 

Saturday, 14 November 2015

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమెల్యే కోవా లక్ష్మి

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమెల్యే కోవా లక్ష్మి 

(రెబ్బెన వుదయం  ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లోని రెబ్బెన గ్రామా పంచాయితి సి.సి రోడ్డు పనులకు తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ ఆధ్వర్యంలో  ఆసిఫాబాద్ నియొజికవర్గ ఎమెల్యే కోవా లక్ష్మి శనివారం నాడు శంకుస్థాపన చేసినారు,  అనంతరము ఎమెల్యే మీడియాతో మాట్లాడుతూ రెబ్బెన గ్రామపంచాయితి  అభివృద్దికి పంచాయితీరాజ్ శాఖా సిడి.పి.ఒ నిధుల నుంచి 23 లక్షల రూపాయలతో సి సి రోడ్డు, సైడ్ డ్రైనేజ్ పనులు చెప్పట్టమని, రాష్ట్ర అబివ్రుదికి తమ ప్రభుత్వం దృడ నిచ్చయంతో ఎంతో కృషి చేస్తుంది అని ఆమె తెలిపారు, అనంతరం మండల కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చెప్పటిన రెండు పడక గదుల ఇంటి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసినారు ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, దానికోసం పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని ఆమె తెలిపారు,  ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా తూర్పు అధ్యక్షులు పురాణం సతీష్, రెబ్బెన మండల అధ్యక్షులు సంజీవ్ కుమార్, జెడ్పిటిసి బాబురావు, తహసిల్దార్ రమేష్ గౌడ్, ఎమ్పిడిఒ ఎం.ఎ.అలీం, రెబ్బెన గ్రామా సర్పంచ్ పెసరి వెంకటమ్మ,  ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్ తెరాస నాయకులూ శ్రీధర్ రెడ్డి, చిరంజీవి గౌడ్, బొమ్మినేని సత్యనారాయణ, రాపర్తి అశోక్, గోదిసేలా వెంకన్న, మదనయ్య, బొడ్డు శ్రీనివాస్ పాలుగోన్నారు.  


సహకార వారోత్సవాలు ప్రారంభం


సహకార వారోత్సవాలు ప్రారంభం


(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన సహకార వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సహకార సంస్థల వారోత్సవాలను సందర్బంగా  చెర్మైన్ గాజుల రవీందర్ జెండా ఎగరవేశారు . సహకార వ్యవస్ధ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వైస్ చేర్మెన్  ఒలువోజు వెంకటాచారి సి .ఈ.ఓ రామడుగు సంతోష్   పాలక .వర్గ సభ్యులు పాల్గొన్నారు  


  

రెబ్బెన మండలంలో ఘనంగా బాలల దినోత్సవం


రెబ్బెన మండలంలో ఘనంగా  బాలల దినోత్సవం


(రెబ్బెన వుదయం  ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రంలోగల ఎస్వి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం బాలల దినోత్సవాన్ని  ప్రిన్సిపాల్ డికొండ సంజీవ్ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలకు పలు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
మండలంలోని పలు పాఠశాలల్లో నెహ్రు జయంతి సందర్బంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈకార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠాలు బోదించడం జరిగింది. అట-పాటల తో పాఠశాలలన్ని పండుగ వాతావరణం నెలకొన్నాయి

Friday, 13 November 2015

బొగ్గు నాణ్యత వారోత్సవాలు

        బొగ్గు నాణ్యత వారోత్సవాలు 

రెబ్బెన మండలంలోని గోలేటి  బెల్లంపల్లి ఎరయలోని జనరాల్ మేనజేర్ కార్యాలయం ఆవరణలో గురువారం  ఉదయం "బొగ్గు నాణ్యతా వారోత్సవాలు "  సందర్భముగా జనరల్ మేనజేర్ శ్రీ కే. రవిశంకర్ గారి ఆద్వర్యములో ప్రతిజ్ఞ చేయడం జరిగిందని డి.జి.ఎం. పర్సనల్ శ్రీ. చిత్తరంజన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భముగా జి.ఎం.రవిశంకర్ గారు మాట్లడుతూ నేటి పోటి మార్కెట్ లో నిలబడాలి అంటే నాణ్యతమైన దిశగా సింగరేణి సంస్థలో నాణ్యతా మెరుగుదలకు తీసుకుంటున్న చర్య మంచి పలితాలను ఇస్తున్నాయన్నారు. మనం బొగ్గు నాణ్యతాను మరింతగా పెంచవలసిన అవసరమున్నదని ఎందుకంటే తగినంత నాణ్యత లేకపోతే వినియోగదారులు విదేశీ బొగ్గు వైపుకు ఆకర్షితులవుతున్నరన్నారు గత ఏడాది నుండి రెబ్బెన సి ఎహ్ పి లో నాణ్యత మెరుగుదలకు దట్టి చర్యలు తీసుకోవడం వలన మంచి పలితాలు సాధించడం అన్నారు. ఈ కార్యక్రమములో  అస్.ఓ.టూ జీ.మ్ కొండయ్య, ఎస్టేట్ అధికారి వరలక్ష్మి, ఎక్కంట్స్ అఫిసేర్ రామారావు, పర్సనల్ మేనజేర్ సీతారం, డి వై. పి.ఎం.రాజేశ్వర్, యునియన్ నాయకులు డి.బి.జి.కె.ఎస్.  నాయకులు సదాశివ్,  కె.ఐ.టి.యు.ఎస్.సి. నాయకులు తిరుపతి జి.ఎం.  కార్యాలయ సిబ్భంది తదితరులు పాల్గొన్నారు. 





                                           

Thursday, 12 November 2015

ఇందిరమ్మఇంటి బిల్లులు చెల్లించాలి

ఇందిరమ్మఇంటి బిల్లులు చెల్లించాలి  

  ఇందిరమ్మ ఇంటి  బిల్లులు ప్రభుతం  లబ్దిదారులు  చెల్లించకపోవడంతో లబ్దిదారులు చాలా ఇబ్భందులు పడుతునారు తెరాస ప్రభుత్వం సి బి సి ఐ డి విచారణలో కాలయాపన చేస్తుందని ,తప్ప బిల్లులను ఇవ్వడం   లేదని .దీంతో    లబ్దిదారులు అప్పులు  చేసి కట్టిన బిల్లులు రాకపోవడంతో ,నెల నెల వడ్దిలు కడుతూ ,చాల ఇబ్బందుల్లో ఉన్నారు అలాగే కూడా రెబ్బెన మండలంలో మరుగు దొడ్డిల సంబందించిన బిల్లులు కూడా రాకపోవడంతో ,అధికారులకు ఎన్నిమార్ల్ చెప్పిన   పట్టించుకోవడంలేదని,అధికారుల ననిర్ల్లక్షంతో  లబ్దిదారులు చాల బాధపడుతునారు ,ఇప్పటికైనా సంబంధిచిన అధికారులు బిల్లులు చెల్లించాలని  ఎ ఐ టి యు సి మండల కార్యదర్శి ,రాయల నర్సయ్య ఓ ప్రకటనలోతెలిపారు 

Tuesday, 10 November 2015

అగ్ని కి ఆహుతి అయిన పత్తి

అగ్ని కి ఆహుతి అయిన పత్తి 
 
రెబ్బెన మండలంలోని నారాయణపూర్ ఏసీ కలని కి చెందినా పెరుగు తిరుపతి తన సొంత  చేనులోని 20 క్విట్టల్ల  పత్తిని ఇంట్లో  నిలువ చేయగా సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగి పత్తి  అగ్ని కి ఆహుతి ఐనదని మంగళవారం తశిల్ధర్ కార్యాలయంలో  నష్టపరిహారం కోరుతూ అర్ ఐ ఆశోక్ వినతిపత్రని అందజేశారు

బాలల దినోత్వంవము సందర్బంగా ఆటలపోటీలు

 బాలల దినోత్వంవము సందర్బంగా ఆటలపోటీలు 

రెబ్బెన: నవంబర్ 14 న బాలల దినోత్వంవము సందర్బంగా బెల్లంపల్లి ఏరియ కమ్యనికేషణ్ సెల్ వారి ఆద్వార్యంలో  ఈ నెల 13న  గురువారం నాడు రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్ షిప్ లో సి ఇ అర్  క్లబ్ నందు తాండూర్ మాదారం రెబ్బెన మరియు గోలేటి టౌన్ షిప్ లలో ని విద్యార్ధిల కు జానపద నృత్యం చిత్రలేఖనము విచిత్ర వేశాద్దారణ  పోటీలు జూనియర్స్ 7వతరగతి వరకు సీనియర్స్ 8వతరగతి నుండి 10వతరగతి వరకు నిర్వహించనున్నట్లు డి జి యమ పర్సనల్ శ్రీ జె చిత్తరంజన్ కుమార్ తెలిపారు ఈ పోటిలలో  గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వబడునని అన్నారు

Monday, 9 November 2015

గొప్ప వారికీ అడుగు జాడల్లో యువత నడవాలి

               గొప్ప వారికీ అడుగు జాడల్లో యువత నడవాలి  

''బోధించు సమికరించు సాధించు'' అని Dr B R అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు నడుస్తున్న కిష్టాపూర్ గ్రామా యువకులకు వారు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకై కృషి చేస్తున్ననందుకు  అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కమిటి నుండి విప్లవ వందనాలు తెలియజేయడం జరిగింది  అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య  జిల్లా అద్యక్షుడు గోలేటి నాగేష్  అన్నారు. సోమవారం రెబ్బెన మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనేది దేశ ప్రగతికి సంభందించిన విషయం కావున అందరూ సహాయ సహకారాలు అందించాలని  తెలిపారు. దీపావళి సందర్బంగా శుభాక్షా లు  తెలియ జేస్తూ ప్రజలు టాపసులు పేల్చే సమయంలో తగు జాగ్రతలు పాటించాలని అన్నారు    ఈ కార్యక్రమంలో పోషయ్య , ప్రవీన్, దీలిప్, తులసిరాం.నీరొస, కమల  రాజశేఖర్, సంతోష్, సతీష, తదీతరులు పాల్గొన్నారు.





తెరాస నేత జన్మదిన వేడుక ఘనంగా

తెరాస నేత జన్మదిన వేడుక ఘనంగా  



 టి అర్ స్ తూర్పు జిల్లా అద్యక్షుడు పురాణం సతీష్ జన్మదిన వేడుకలను రెబ్బెన మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో తూర్పు జిల్లా ఉప అద్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్ అద్వర్యంలో తెరాస నాయకులూ ఘనంగ జరుపుకున్నరు. ఈ సందర్భంగా నాయకులూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణి చేశారు.ఈ కార్యక్రమమలో ఎంపీపీ సంజీవ్ కుమార్ ,జడ్ పి టి సి బాబురావు తూర్పుజిల్లా మహిళా కార్యదర్శి కుందారపు శంకరామ్మ,సోమశేఖర్,చిరంజీవి,బొడ్డు శ్రీనివాస్,రెబ్బెన సర్పంచ్‌ పెసరు వెంకటమ్మ,నంబాల సర్పంచ్‌ గజ్జెల సుశీల,పట్టాన అద్యక్షుడు రాపర్తి శేకర్,మధునయ్య,వెంకన్న గౌడ్,ఇతర టిఆర్‌ఎస్‌ నాయకులు  పాల్గొన్నారు 

Sunday, 8 November 2015

వర్గీకరణ సాధనకు మరో పోరాటం

వర్గీకరణ సాధనకు మరో పోరాటం 

  
ఎస్సీల వర్గీకరణ సాధనకు మరో పోరాటం  చేయాల్సిన  అవసరం ఎంతైనా ఉందని ఎం అర్ పీ ఎస్ జిల్లా ఇంచార్జ్ అర్ . రామచంద్రం మాదిగ అన్నారు . శనివారం రెబ్బెనలో ఆయన విలేకర్లతో  మాట్లాడారు.  కె సి అర్ ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారని,  ఆయన మాదిగలు చేసే డిమాండ్లు న్యాయపరమైనవని ఆయన అన్నారు.దలిథులకు 3 ఎకరాల సాగు భూమి ,డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసారని అన్నారు. కె సి అర్ కు మాదిగలపై చిత్తశుద్ది ఉంటె అఖిలపక్ష బృందాన్ని డిల్లి కి పంపి పార్లమెంటులో వర్గీకరణ చట్టబద్దత కల్పించి ఆయన నిజయతిని నిరూపించు కోవాలని ఆయన అన్నారు. లేని పక్షములో మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెఛరించారు. ఈ నెల 15న ఎం అర్ పి ఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆసిఫాబాద్ కు వస్తున్నారని, ఈ సభకు మాదిగలు , విద్యార్థులు , మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు ,ఈ కార్య క్రమమములో ఎం అర్ పి ఎస్ నాయకులూ నారాయణ, వెంకటేష్ మాదిగ, రాజందర్ మాదిగ, బొంగు నరసింగరావు మాదిగ, వెంకటి మాదిగ, రాజు మాదిగ  తదితరులు పాల్గొన్నారు 

Thursday, 5 November 2015

చలో డిల్లీ విజయవంతం చేయాలి ఎ.ఐ.ఎస్.ఎఫ్


చలో డిల్లీ విజయవంతం చేయాలి ఎ.ఐ.ఎస్.ఎఫ్

           రెబ్బెన ;; కామన్ విద్యా విదానానాన్ని అమలు చేయాలనీ జీరో నుండి పిజి వరకు ఉచిత విద్యా అందించాలని ఎ.ఐ .ఎస్.ఎఫ్ జిల్లా ఇంచార్జ్ ఎస్ .తిరుపతి అన్నారు. రెబ్బెన మండలము లోని గోలేటి   కె.ల్.మహేంద్ర భవనములో గురువారము నాడు  నవంబర్ 17 న పార్లమెంట్ ముట్టడి మరియు చలో డిల్లి కరపత్రాలను విడుదల చేశారు. 
                 అనతరం ఆయన మరియు ఎ.ఐ.ఎస్.ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ , జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపేందర్  మాట్లాడుతూ   ఉన్నత విద్యారంగములో డబ్ల్యు.టి.ఒ గాడ్స్ ఒప్పందాలను విరమించుకోవాలని విదేశీ యూనివెర్శి టిల  బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి ఆలోచన విరమింప జెసుకొవాలని  దేశ వ్యాప్తంగా ప్రజా స్వామ్య పద్దతిలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 17 న దేశ వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులను సమీకరించి దేశ రాజాధనిలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని ఎ.ఐ.ఎస్ .ఎఫ్ నిర్వహిస్తుంది .కావున ఈ కార్యకరమాన్ని విజవంతం చేయాలని కొరారు.  ఈ కార్యాక్రమంలో  మండల కార్యదర్శి పూదరి సాయి కిరణ్ , నాయకులు రామగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

65వ రోజుకు చేరుకున్న ఆశాకార్యకర్తల సమ్మె


65వ రోజుకు చేరుకున్న ఆశాకార్యకర్తల సమ్మె





రెబ్బెన ;; తమ న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని రెబ్బనలో  హెల్త్ వర్కర్స్ (ఆశ కార్యాకర్తలు)  ఈ సందర్భంగా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ నేటి సమాజంలో పెరుగుతున్న కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువులకు అనుగుణంగా ప్రభుత్వం తమ వేతనాలను పెంచాలని, లేదంటే తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారై వీధుల పాలవుతాయని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, రెబ్బెన ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు ఆశ కార్యాకర్తల సమ్మె నేటికి 65 రోజులు అవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాకపోవడం విడ్దూరంగా ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యాక్రమంలో , సుకన్య,  పద్మ, సరోజన, భాగ్య  ఆశ కార్యాకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Wednesday, 4 November 2015

విద్యార్థులకు ఉచితంగా టై, బెల్టుల పంపిణి

విద్యార్థులకు ఉచితంగా టై, బెల్టుల పంపిణి


పేద విద్యార్థులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటేనే వారు బాగా చదివి ప్రయోజకులు అవుతారనే ఉద్దేశ్యంతో గంగాపూర్ సర్పంచ్ ముంజం రవీందర్ మరియి వార్డు సభ్యురాలు దొంగ్రి సుమిత్ర రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామా పంచాయితి లోని పాశిగాం ఎంపిపీస్ ప్రభుత్వ పాటశాలలోని 64 మంది విద్యార్థులకు ఉచితంగా గుర్తింపు కార్డులు, టై, బెల్టులు అందజేశారు. ఈ కార్యాక్రమంలో పాటశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్, అనిల్ కుమార్, ఉపాధ్యాయులు ఎ, శ్రీకాంత్, డి, కవిత, ఎస్ఎంసి చైర్మన్ బి, పాలక్ రావు, విధ్యారులు పాల్గొన్నారు. 

విద్యార్థులకు సామాగ్రి పంపిణి

విద్యార్థులకు సామాగ్రి పంపిణి


విద్యార్థులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటేనే ప్రతిభావంతులు అవుతారనే ఉద్దేశ్యంతో రెబ్బెనకు చెందిన వ్యాపారి నటరాజ్ మరియి  వస్రం నాయక్ (గ్రీన్ హెల్త్ ఫౌండేషన్) రెబ్బెన మండలంలోని పులికుంట ప్రభుత్వ పాటశాల  విద్యార్థులకు ఉచితంగా ప్యాడ్లు, పెన్నులు, పుస్తకాలు,  అలాగే పాటశాల ప్రధానోపాధ్యాయుడు టీ, శ్రీనివాస్ గుర్తింపు కార్డులు, టై, బెల్టులు, మరియి హరితహరంలో భాగంగా పచ్చదనమే ప్రగతికి మూలాధారం అని భావించి ప్రధానోపాధ్యాయుడు టీ, శ్రీనివాస్ పాటశాల ఆవరణలో మొక్కలు నాటారు, వాటికి గ్రామ ప్రజలు కంచెను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వెంకటేశ్వర  స్వామి, సర్పంచ్ సుశీల, ఎంపిటిసి  కొవ్వూరి శ్రీనివాస్, పాటశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహ స్థాపనకు కృషి--ఎఅయ్ఎఫ్డిఎస్

 అంబేద్కర్ విగ్రహ స్థాపనకు కృషి--ఎఅయ్ఎఫ్డిఎస్



భారత రాజ్యాంగ నిర్మాత డా, బీ,ఆర్ అంబేద్కర్ విగ్రహం కిష్టాపూర్ లో  స్థాపనకు  అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య ఆధ్వర్యంలో రెబ్బెనలోని అంబేద్కర్ కు వినతీ పత్రాన్ని అందజేశారు, అంబేద్కర్ విగ్రహ స్థాపనకు ఎఅయ్ఎఫ్డిఎస్   కృషి చేస్తుందని అన్నారు. బుధవారం నాడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిష్టాపూర్ లో అంబేద్కర్ గారి విగ్రహ స్థాపనకు తాము తోడ్పడుతామని, అలాగే గ్రామంలోని ప్రజలు తోడ్పడాలని అన్నారు. ఈ విగ్రహానికి తమకు తోచిన విధంగా ఆర్ధిక సహాయాన్ని అందించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో సునార్కర్ రాజశేఖర్, ముంజం సంతోష్, సతీష తదీతరులు పాల్గొన్నారు.

ఉచిత బాక్సింగ్ శిక్షణ శిబిరాలు,, కార్యవర్గం ఎన్నిక

ఉచిత బాక్సింగ్ శిక్షణ శిబిరాలు,, కార్యవర్గం ఎన్నిక


క్రీడలు పట్టణాలకే పరిమతం కాకుండా  గ్రామీణ ప్రాంతాలలో ఉచిత బాక్సింగ్ శిక్షణ శిబిరాలు ప్రారంభిస్తున్నామని జిల్లా బాక్సింగ్ సంఘం కార్యదర్శి పాదం మహేందర్ అన్నారు. బుదవారం నాడు రెబ్బెన అతిధి గృహంలో విలేకరుల సమావేశములో ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో కూడా బాక్సింగ్ క్రీడని అభివృద్ధి పరచాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే శిక్షణ కేంద్రాలను  అన్ని మండల కేంద్రాలలో ఏర్పాటుచేస్తున్నామని అన్నారు.అనంతరం రెబ్బెన మండల బాక్సింగ్ క్లబ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రెబ్బెన బాక్సింగ్ క్లబ్  అధ్యక్షుడు  టి శ్రీనివాస్, ఉప అద్యక్షుడు యం.తిరుపతి, కార్యదర్శి యం.శ్రీనివాస్, ఉపకార్యదర్శి టి.నరేష్, గౌతం, పి. శ్రీనివాస్ లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు