Wednesday, 7 October 2015

ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలి


ఆరోగ్య సేవలందిస్తున్న ఆశాకార్యకర్తల సమస్యలను ప్రభుత్వము సత్వరమే పరిష్కరించాలని మండల కార్యదర్శి అధ్యక్షురాలు అనిత డిమాండు చేశారు.మాట్లాడుతూ తమ హక్కుల సాధన కోసం చేస్తున్న రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరవధిక సమ్మె మంగళవారానికి 35 వరోజుకు చేరిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశావర్కర్లు నిరవదిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీమన్నారు. ఇప్పటికైనా ఆశావర్కర్ల డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో సునీత, నిర్మల, చాయ ,  సుకన్య, సుజాత, భాగ్య, తిరుమల,  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment