దొంగతనాలు తో వాహన యజమానుల ఆందోళన
రెబ్బెన మండల కేంద్రం లో వివిధ అటో ట్రాలీలకు చెందినా టైరులు, బ్యాటరి మరియు పనిముట్ల కిట్టు దొంగతనం జరిగింది, వాహన యజమానుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి వారు పని ముగించుకొని వారి ఇంటిముందు పార్కు చేసిన ఆటోలో ని సామగ్రిని దొంగిలించారు అని వారు తెలిపారు రెబ్బెన కు చెందిన పందిర్ల శ్రావణ్ కుమార్ కు చెందిన అప్పి ట్రాలీ అటో కు చెందినా బ్యాటరిని, కనకయ్య కు చెందినా ఆటో ట్రాలీ నుండి టైర్లు మరియు నందేవ్ ఆటో ట్రాలీ నుండి పనిముట్ల సామాగ్రి ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు, ఇలాంటి సంఘటననే ఇంతకు ముందు కూడా అదే స్థలంలో లారీలనుండి టైర్లు మరియు డిజిల్ దొంగతనం జరిగింది అని, అప్పుడు తగు చర్యలు తీసుకోనివుంటే మల్లి ఇలాంటి సంఘటన జరిగేది కాదని వారు తెలిపారు.
No comments:
Post a Comment