జాతిపిత మహాత్మగాంధీజీ ఆశయాలను నెరవేరుద్దామని తహసీల్దార్ రమష్ గౌడ్ అన్నారు రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి అధికారులు పూలమాలలు వేసి 146వ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ ధర్మం, అహింస మార్గాలను ఆచరించాలని స్వచ్చ తెలంగాణాలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని, మహాత్మడి కలలను సహకారం చేసుకొనేందుకు చేయి చేయి కలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్, జడ్పిటిసి బాబురావు, ఎంపీడీవో ఎంఎ హలీం, ఎపీఎమ్ రెబ్బెనక్లస్టర్
రాజ్ కుమార్, ఉపతహసీల్దార్ రామ్మోహన్, ఎంఈఓ వెంకటేశ్వరస్వామీ, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, సాక్షర భారత్ కోఆర్దినెటార్ సాయిబాబా, కార్యాలయ సిబ్బంది, తదీతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment