Wednesday, 14 October 2015

సర్పంచ్ వైఖరిని నిరసిస్తూ గ్రమాస్తుల నిరసన


                      సర్పంచ్ వైఖరిని నిరసిస్తూ గ్రమాస్తుల నిరసన  
               

 రెబ్బెన మండల  నారాయణపూర్ గ్రామా పంచాయతి లో గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ సభలో సర్పంచ్ వేమునూరి వెంకటేశ్వర్లు, వార్డ్ సభ్యులు, మరియు గ్రామపంచాయతి కార్యదర్శి హాజరైనారు.సభనిర్వహిస్తుండగా సభలో గ్రామప్రజలందరూ కలిసి గ్రామంలో ప్రధానంగా నెలకొన్న త్రాగునీటి సమస్య ,రోడ్లసమస్య ,విద్యుద్దీపాల సమస్య ,మురికికాలువలను మరియు పలు సమస్యలను అడగగా సమాదానం ఇవ్వకుండా సభ జరుగుతుండగా మద్యలోనుంచి సర్పంచ్ వేమునూరి వెంకటేశ్వర్లు వెళ్లిపోయారని గ్రామప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ఇదేమిటని పంచాయతి  కార్యదర్శి రాధికను అడగగా సర్పంచ్ సరిగ్గా పనిచేయడము లేదని దానికి నేను భాధ్యురాలిని కాదని అన్నారు. దీంతో ఆ గ్రామా ప్రజలు తీవ్ర అసహననికిలోనై పంచాయతి కార్యాలయం ఎదుట ధర్నాచేసి నిరసనవ్యక్తము చేసినారు . ఈ సభలో ఉపసర్పంచ్ ఎరావోతుల పద్మ, వార్డ్ సభ్యులు భగ్యలక్ష్మి,రవీందర్,అనిత,బిజెపి మండల అద్యక్షులు రాచకొండ రాజయ్య ,సుమన్ ,తిరుపతి,జ్యోతి ,సుశీల ,కోటేశ్ ,వెంకటేష్,రవీందర్,జగదీష్ తదితర గ్రామాప్రజలు పాల్గొన్నారు. 
   

No comments:

Post a Comment