Monday, 19 October 2015

గని వన్‌ఎ పై అపోహలు వద్దు


గని వన్‌ఎ పై అపోహలు వద్దు : ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య 


రెబ్బెన మండల లోని  గోలేటి వన్‌ఎ గని భవిష్యత్తుపై కార్మికులు ఎలాంటి అపోహలకు గురికావద్దని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి వన్‌ఎ గనిపై నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గోలేటి గనిపై కార్మికుల్లో అయోమయం నెలకొంది. దీనిపై డైరెక్టర్‌ ఏపీ మనోహర్‌ను కలిసి మాట్లాడటం జరిగిందని ఈసందర్భంగా గని భవిష్యత్తును తెలుపాలని కోరినట్లు ఆయన తెలిపారు. గని భవిష్యత్తు దృష్ట్యా ఇక్కడే ఇసుక బంకను ఏర్పాటు చేసి గనిని కాపాడాలని కోరారు. సీనియర్‌ కార్మికులను ఓపెన్‌కాస్ట్‌లకే బదిలీలు చేయాలని, బదిలీ వర్కర్లను వారు కోరిన చోట పోస్టింగ్‌లు ఇవ్వాలని తెలిపారు. సకలజనుల సమ్మె వేతనాలు, వారసత్వ ఉద్యోగాలు ఇప్పించడంలో గుర్తింపు సంఘం విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నర్సయ్య, ఎస్‌. తిరుపతి, మొగిలి,సంపత్‌, రామారావ్‌ , ఎంపీ వెంకటేష్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment