రెబ్బెన లో వైభవంగా మొహర్రం పండుగ
రెబ్బెన మండంలోని పలు గ్రామాల్లో కుల, మతాల సామరస్యానికి ప్రతీకగా మొహర్రం పర్వదినాన్ని శనివారం వైభవంగా నిర్వహించుకున్నారు.రెబ్బెన జామ మసిదు వారు మసిదు ఏదుట పాలతో చేసేన షరబత్ పపీని చేశారు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మైనార్టీలు పీర్లను చావిడి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీర్లకు మిరియాలు, మర్మాలు చల్లి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. పీర్లకు చమికులు, పూలు అలంకరించి ప్రాంతాలలో ఊరేగిస్తూ ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో ప్రవేశించారు. ఈ పండుగకు హిందూ, ముస్లీంలు కలిసి పూజలు నిర్వహించి మత సామరస్యానికి ప్రతీక మొహర్రం పర్వదినమని నిరూపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
No comments:
Post a Comment