Friday, 16 October 2015

బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి జీ ఎం రవిశంకర్‌

బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి జీ ఎం రవిశంకర్‌

సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా బెల్లంపల్లి ఏరియా జీ ఎం రవిశంకర్‌  బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలంలోని గోలేటి జీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ ఉత్సవాలను పలు కాలనీలలో భారీ ఎత్తున నిర్వహించాలని, అందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను, ఆయా డిపార్ట్‌మెంట్‌ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు, అలాగే బతుకమ్మ సాంగ్స్‌ పాడిన అభ్యర్ధులు బహుమతులను ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలోఎస్‌ఓ, టీఓ , జీఎం కొండయ్య, డీ వైపీఎం చిత్రంజన్‌ కుమార్‌,అధికారులు పాల్గొన్నారు

No comments:

Post a Comment