ఆశలు మోకాళ్ళపై వినూత్న నిరసన
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన ఆశావర్కర్లు శనివారం కూడా సమ్మెను కొనసాగించారు రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమ్మెలో మోకాళ్ళ మీదా నిలపడి వారి నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆశావర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు అనిత, కార్యదర్శులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని 32 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం తమకు తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది అని వారు వాపోయారు. తాముకూడ ప్రజల కొరకు పని చేస్తున్నామని మార్కెట్ లో నిత్యావసరాల సరుకుల ధరలు ఆకాశానంటు తున్నందున, ప్రభుత్యం ఇస్తున్న వేతనం మాకు ఏమలనకు కూడా సరిపోవడం లేదు కావున కనీస వేతనం పెంచాలని వారు డిమాండ్ చేశారు, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి పరిష్కరమయ్యేలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆశావర్కర్లు, సునీత, సుకన్య, సుజాత, భాగ్య, తిరుమల, నిర్మల, చాయ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment