ఘనంగా నిరవహిస్తున్న దేవీ నవరాత్రోత్సవాలు
రెబ్బెన మండలంలోని పలు గ్రామాల్లో దేవీ నవరాత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా పండుగ సందర్భంగా సకల దేవతా స్వరూపిణి...జగన్మాతను భక్తి శ్రద్దలతో సహస్త్ర నామాలతో వివిధ రకాల పూజలతో వేద మంత్రాల సాక్షిగా శ రన్నవరాత్రోత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా మండలం లోని గంగాపూర్లో గల వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి ఆలయంలో, ఇంద్రానగర్లో గల ఆలయంలో కనకదుర్గమ్మ వారి దసరా నవరాత్రులను ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. నేటి నుండి 9 రోజుల పాటు ఈ నరవరాత్రోత్సవాలు నవరూపాలుగా జరగనున్నాయి.ఈ కార్యక్రమంలో ఇంద్రానగర్ వినోద్ స్వామి,మాధవ్ సంజీవ్,ఇస్తారి,సాయి,సురేష్,సంతోష్ మండలంలో ప్రజలు కనకదుర్గమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
No comments:
Post a Comment