37వ రోజుకు చేరింన ఆశావర్కర్ల నిరవధిక సమ్మె
రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆశావర్కర్ల చేపట్టన నిరవధిక సమ్మె గురువారం నాటికి 37వ రోజుకు చేరింది. మండల కార్యదర్శి అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ గురువారం నాటికి 37వ రోజుకు చేరింన ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని, ప్రతి రోజు ఏదో ఒక రీతిలో సమ్మెను కొనసాగిస్తుండగా గురువారం చేతితో కళ్లను మూసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటుందనే దానికి ఇదే నిదర్శనమన్నారు. సమ్మెలో నిర్మల, సునీత, నిర్మల, చాయ , సుకన్య, సుజాత, భాగ్య, తిరుమల, సుశీల తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment