రైతుల ఆత్మహత్యలపై ఇప్పటికైనా కళ్లు తెరవలి-అఖిలపక్షం నాయకులు
రైతుల ఆత్మహత్యలు, రుణాల మాఫీ, బూటకపు ఎన్‌కౌంటర్లకు అసెంబ్లిలో ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌కు అంశంపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం రెబ్బెన లో వ్యాపర సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, స్వచ్ఛందంగా ప్రశాంతంగా జరిగిది బంద్ సందర్భంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రెబ్బెనలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అఖిలపక్షం పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో రైతులు బతకలేని పరిస్థితి ఉందని, ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రతిపక్షాలు అడిగినందుకు వారి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బతుకమ్మ పండుగకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సంబరాలు నిర్వహిస్తున్నారని, మరో వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మాత్రం పట్టించుకోవడం లేదని, ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కడా లేదని రైతు ప్రభుత్వమని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని . రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలని సూచించారు కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పార్టీలు బంద్‌లో పాల్గొననున్నాయి. కార్యక్రమంలోమోడెమ్ సుదర్శన్ గౌడ్,బొమ్మినేని శ్రీధర్,ముంజం రవీందర్,శ్రీనివాస్ గౌడ్, అజయ్ జైశ్వాల్,చక్రపాణి, బోగే ఉపెంధర్, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment