వయోజన విద్య 100% అక్షరాశ్యత సాధించాలి -ఎంపీపీ
గాంధీజీ 146 జయంతి వేడుకలను శుక్రవారం రెబ్బెనలోని జడ్పిఎస్ఎస్ పాటశాలలో ఘనగా పురష్కరించుకొని అనంతరం ఎంపీపీ సంజీవ్ అమ్మ నాన్నకు చదువు కార్యాక్రమం గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుంచి 8, 9, 10వ తరగతి చదివే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చదవడం, రాయడం వచ్చే విధంగా చదువు నేర్పించాలని, ఎన్,ఆర్,ఈ,జీ,ఎస్ వారి గ్రూపులో ఉన్న నిరక్షరాసులకు 90 రోజుల్లో చదువు నేర్పించాలని తెలంగాణా రాష్ట్రంలో అదిలాబాద్ జిల్లలో గ్రామ జ్యోతి వయోజన విద్య 100% అక్షరాశ్యత సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పిటిసి బాబురావు, ఎంపీడీవో ఎంఎ హలీం, ఎపీఎమ్ రెబ్బెన క్లస్టర్ రాజ్ కుమార్, ఎంఈఓ వెంకటేశ్వర స్వామీ, ఎచ్ఎం. స్వర్ణలత, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, సాక్షర భారత్ కోఆర్దినెటార్ సాయిబాబా, పాటశాల సిబ్బంది, విద్యార్థులు తదీతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment