గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వకపోవడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందని తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో రెబ్బెన బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా అధ్యక్షులు సాయి మాట్లాడుతూ దాదాపుగా 17వందలకోట్ల బకాయిలతో ఉపకారవేతనాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు పరష్కరించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపకారవేతనాలను పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామి ఉచిత విద్యను అమలు చేయాలని, కార్పోరేట్ విద్యను రద్దు చేసి మెస్‌చార్జీలు పెంచాలని, సన్నబియ్యంపై విచారణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు వినోద్, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 2 October 2015
పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనాలు విడుదల చేయాలి
గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వకపోవడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందని తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో రెబ్బెన బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా అధ్యక్షులు సాయి మాట్లాడుతూ దాదాపుగా 17వందలకోట్ల బకాయిలతో ఉపకారవేతనాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు పరష్కరించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపకారవేతనాలను పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామి ఉచిత విద్యను అమలు చేయాలని, కార్పోరేట్ విద్యను రద్దు చేసి మెస్‌చార్జీలు పెంచాలని, సన్నబియ్యంపై విచారణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు వినోద్, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment