Friday, 28 December 2018

కాంగ్రెస్ పార్టీ 134 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై నాలుగు వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం రెబ్బెన మండల పార్టీ కార్యాలయం ఎదుట మండల అధ్యక్షుడు ముంజం రవీందర్ కాంగ్రెస్ పార్టీ జెండాను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ముంజం రవీందర్, డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు పల్లె ప్రకాశరావు  మాట్లాడుతూ    కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత క్లార్యకర్తలందరిపై ఉందని  రాబోయే పంచాయతీ  ఎన్నికల్లో అందరూ పార్టీ గెలుపు కోసం శ్రమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు దుర్గం రాజేష్,  పీఎస్సీ వైస్ చైర్మన్ వెంకటేశంచారి, టౌన్ అధ్యక్షులు  మురళి, ప్రధాన కార్యదర్శి దేవాజీ, మల్లారెడ్డి, పల్లాస్, బానయ్య, రమేష్, కిషన్ గౌడ్, మన్యం పద్మ, విజయలక్ష్మి,  తదితర నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment