Saturday, 15 December 2018

బ్యాంకింగ్ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 15 ;  బ్యాంకింగ్ రంగంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని  డెక్కన్ గ్రామీణ బ్యాంకు  ఫీల్డ్ ఆఫీసర్ రవికుమార్ అన్నారు. శనివారం మండల  కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు బ్యాంకింగ్ రంగంపై అవగాహన సదస్సును రెబ్బెన మండల కేంద్రంలోని  డెక్కన్ గ్రామీణ బ్యాంకులో    నిర్వహించారు.  బ్యాంకు లో ప్రతి నిత్యం జరిగే లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ , ఫిక్సడ్  డిపాజిట్, సేవింగ్స్, ఆర్ టి జి ఎస్, నిఫ్ట్  మరియు  ఫోన్ ద్వారా సేవింగ్స్ బ్యాంకు బాలన్స్ తెలుసుకొనుట,  తదితర అంశాలపై వివరించారు. బ్యాంకు ఖాతా దారులు తమ  ఖాతాలలో ఉన్న జమ వివరాలను కేవలం ఒక మిస్సెద్  కాల్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ఫోన్ నెంబర్ 092780 31313 కు డయల్ చేసిన వెంటనే మెసేజ్ రూపంలో తెలియచేయబడతాయని వివరించారు.   ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు శ్రీకాంత్, ప్రభాకర్, శ్రీదేవి, గోపాల్, పు ష్పలత, చంద్రశేఖర్, తుకారాం, శ్రీలత , బ్యాంకు సిబ్బంది , శంకర్, వెంకటేశ్వర్ రెడ్డి, హుస్సేన్, గీత, ఆనందరావు తదితరులు  పాల్గొన్నారు. 

No comments:

Post a Comment