కోమురం భీంమ్ రెబ్బెన డిసెంబర్ 26 : పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్నామని రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి అన్నారు. బుధవారం గంగాపూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. స్వచ్ఛ ఆసిఫాబాద్ కార్యక్రమంలో భాగంగా గంగాపూర్ , తుంగడ గ్రామాలను దత్తత తీసుకోని పోలీస్ శాఖ తగిన సహకారం అందిస్తుందని అన్నారు. స్వచ్ భారత్ మిషన్ లో భాగంగా గ్రామాల్లోని అందరు వ్యక్తిగత మరుగు దొడ్లను నిర్మించుకోవాలని కోరారు. ఆసిఫాబాద్ జిల్లాను 100 శాతం మరుగు దొడ్లు నిర్మించుకున్న జిల్లాగా చేయాలని ఈ విషయంలో ప్రజలు అవగాహన పెంచుకోని సహకరించాలని కోరారు, వ్యక్తిగత మరుగుదొడ్ల వలన పరిసరాల పరిశుభ్రత కాపాడుకోవచ్చని, తద్వారా అనేక వ్యాధులకు కారణమైన బాక్టీరియా అభివృద్ధి చెందకుండా గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్, మాజీ సర్పంచ్ ముంజం రవీందర్, ఎంపీటీసీ లు శ్రీనివాస్ ,స్వచ్ఛభారత్ ఫణి కుమార్, అంజనా, గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment