Friday, 28 December 2018

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జుమ్మిడి అరుణ్ కుమార్

 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 28 : ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రెబ్బెన మండలం గోలేటికి చెందిన జుమ్మిడి అరుణ్ కుమార్ నుఎంపిక చేసినట్లు ఏబీవీపీ రాష్ట్రాధ్యక్షులు మీసాల ప్రసాద్ శుక్రవారం  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జుమ్మిడి అరుణ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు మీసాల ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాగే   రంజిత్   కు కృతఙ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన భాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు. ఈ నెల 29, 30 తేదీలలో గుజరాత్ లో జరిగే మహాసభలలో పాల్గొని మరింత అవగాహనతో తన పై ఉంచిన భాధ్యతను నిర్వర్తిస్తానని అన్నారు. 

No comments:

Post a Comment