Sunday, 16 December 2018

చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి ; ఎస్పీ మల్లారెడ్డి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 16 ; చట్ట వ్యతిరేక  కార్యక్రమాలకు  ప్రజలు దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని, వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించలని   ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. ఆదివారం  రెబ్బెన మండలం లోని సింగిల్ గూడ గ్రామంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించరూ. ఈ సందర్బంగా  ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ గుడుంబా ప్రభావిత గ్రామాల్లో,నాటు సార నిషేధిత, గుట్కా,తంబాక్, వినియోగించడంతో మానవాళి ఆరోగ్య సమస్యలతో కుటుంబాలు చిన్నబిన్నమౌతున్నాయని వారికి తెలిపారు.  మరియు బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పించి విద్య బుద్దులకు అలవాటు చేయాలని అన్నారు,బాల్య వివాహాలు చేయరాదని గ్రామంలోని ప్రజలకు సూచించారు. కార్టన్ సెర్చ్ లో 5 లీటర్ల గుడుంబా మరియు సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు అలాగే మద్యం తాగి వాహనాలు నడిపేవారికి తగిన చట్టరీత్య చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి మండల,గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించి ప్రజలకు భద్రతను,భరోసాను కల్పించనున్నట్లు ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు.డీఎస్పీ సత్యనారాయణ,సిఐ రమణమూర్తి,ఆరుగురు ఎస్ ఐ లు, డికొండ రమేష్. 56 మంది పోలీస్ సిబ్బంది తో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

No comments:

Post a Comment