Sunday, 23 December 2018

ఘనంగా సింగరేణి 130 వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు


 



కోమురం భీంమ్ రెబ్బెన  డిసెంబర్ 23  :సింగరేణి 130 వ ఆవిర్భావ వేడుకలు  బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి టౌన్ షిప్ లో గల భీమన్న మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  బెల్లంపల్లి ఏరియ జనరల్ మేనేజర్ కె.రవిశంకర్    సింగరేణి పతాక ఆవిష్కరణ చేశారు.  అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. సింగరేణి  చరిత్రను, ప్రగతి, విజయాలను చాటిచెప్పే విధంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  
 అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కర్మికులుపైనే కాకుండా కార్మికుల కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద వహిస్తోంది అని అన్నారు.  కార్మికుడు ఇంటి వద్ద ప్రశంతగా ఉన్నపుడే ఉత్పతి పై దృష్టి సాదిస్తారని ఆయన అన్నారు కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకోని ఆరోగ్యం కోసం ఆయుర్వేద వైద్య సదుపాయములు కల్పించామని నిరుద్యోగ యువతీయువకులు స్వయం కృషితో పారిశ్రామికవేత్తలు స్వయం సంపాదకులుగా ఏదిగే అవకాశం కల్పిస్తాము అన్నారు. అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో కలసి పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని అన్నారు. సింగరేణి సంస్థలో సభ్యుడైనందుకు తానూ గర్విస్తున్నానని, అలాగే ప్రతి సింగరేణీయుడు అనుకొంటున్నాడని అన్నారు. దక్షిణాదిలో సింగరేణి సమాజ హిత కార్యక్రమాలలో ముందుంటుందన్నదని అన్నారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ పథకంలో సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాలలో అనేక గ్రామాల అభివృద్ధికి తనవంతు సాయంగా వేలకోట్ల రూపాయలతో అభివృద్ధిని చేపట్టిందని అన్నారు. సింగరేణి తల్లికి మనమందరం శ్రద్ధతో సేవచేస్తే ఆ తల్లి మనలను మరింత అభివృద్ధి వైపు తీసుకోని వెళుతుందని కావున మనందరం మన పనిలో పునరంకితమౌదామని పిలుపునిచ్చారు. అనంతరం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన ఉద్యోగులకు  బహుమతులు ప్రదానం చేశారు. సాంస్కృతిక  కార్యక్రమాలలతో కళాకారులు ఆహుతులను అలరించారు.     ఈ కార్యక్రమాలలో  ఎస్ ఓ టు జి యం సాయిబాబా, సేవాసమితి అధ్యక్షురాలు అనురాధ రవి శంకర్ డి జి యం ప్రర్సనల్ జె  కిరణ్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస రావు,  డి జి యం సివిల్ ప్రసాద్,  యూనియన్ నాయకులూ తిరుపతి , సేవాసభ్యులు కుందారపు శంకరమ్మ, సొల్లు లక్ష్మితదితర సభ్యులు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment