Saturday, 1 December 2018

ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, ; రెబ్బెన మండలం నారాయణ పూర్ గ్రామంలో పతంజలి యోగ పీఠం హరిద్వార్ వారి ఆధ్వర్యంలో శనివారం ఐదురోజుల ఉచిత యోగా శిక్షణ  శిబిరాన్ని   కొమరం భీమ్ జిల్లా ప్రచారక్ దాసరి వినోద్ గౌడ్ ప్రారంభించారు, ఈ సందర్భంగా   మాట్లాడుతూ యోగాను రోజు చేయాలని చేసినట్లయితే వ్యాధులు దరిచేరవని ఆయన తెలిపారు.  తదనంతరం నారాయణపూర్ ప్రభుత్వ పాఠశాలలో యోగ పైన అవగాహన కల్పించారు మరియు గ్రామంలో యోగ, స్వచ్ఛత, పచ్చదనం, గోమాత గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ వాసులు మరియు పాఠశాల   ప్రధానోపాధ్యాయిని మరియు ఉపాధ్యాయుని లు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment