Tuesday, 25 December 2018

జవాన్ మృతికి సంతాపంకంగా కొవ్వొత్తుల ర్యాలీ

       
కోమురం భీంమ్ రెబ్బెన  డిసెంబర్ 25 : దేశ మాత రక్షణ కోసం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఆర్మీ జవాన్ దక్వా రాజేష్ మృతికి సంతాపకంగా మంగళవారం రాత్రి రెబ్బెన మండల కేంద్రంలో రెబ్బెన సీఐ  రమణ మూర్తి ,ఎస్సై దీకొండ  రమేష్ తో పాటు వివిద రాజకీయ పార్టీల నాయకులు ,వ్యాపారస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు . స్థానిక పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ మీదుగా ప్రధాన రహదారి వెంట గంగాపూర్ కామన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ సంతాపం ప్రకటించారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం జిల్లా వాసి దక్వా రాజేష్ శత్రు దేశం చేతిలో అసువులు బసటం బాధాకరమన్నారు. మాతృభూమి సేవలో ఎంతో మంది సైనికులు నిద్రాహారాలు మాని దేశానికి రక్షణగా నిలుస్తున్నారని అలాంటి సైనికులను శత్రు దేశాలా తీవ్రవాదులు పొట్టన పేట్టుకోవటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చెర్మైన్ కుందారపు శంకరమ్మ,  నవీన్ జైస్వాల్, వినోద్ జైస్వాల్ , బొమ్మినేని శ్రీధర్, వస్రం నాయక్,  నవీన్, పెసర మధునయ్య ,అశోక్, రమేష్, శాంతిగౌడ్, సర్వేశ్ గౌడ్, చెన్నసోమశేఖర్ , భార్గవ్ గౌడ్, గోపి, సుదర్శన్ గౌడ్ , మద్ది శ్రీనివాస్,  ప్రవీణ్ , ఫణి కుమార్, కీర్తి మహేందర్, రాజు,సతీష్,కృష్ణ, వ్యాపారస్తులు శంకర్, తుషార్ కొడియర్, ఘన్ శ్యామ్, వేణు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.   
గోలెటిటౌన్ షిప్ లో కొవ్వొత్తుల ర్యాలీ   
 జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో భారతదేశం రక్షణ కొరకు తన ప్రాణాలను అర్పించిన కొమురం భీం జిల్లా కు చెందిన జవాన్ రాజేష్ ఆత్మకు శాంతి కలగాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గోలేటి లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి BYBS, బిజెపి నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిల్ల నర్సయ్య, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్, బిజెపి నాయకులు ఆంజనేయులు గౌడ్, BYBS నాయకులు రంజిత్, రవీందర్, మహేందర్ ,సాయి ,తిరుపతి ,రాజేష్ ,సమీర్ పాల్గొన్నారు..

No comments:

Post a Comment