Wednesday, 19 December 2018

పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 19 ; శీతాకాలంలో పశువులకు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున  తగిన జాగ్రత్తలు తీసుకుంటూ  ప్రభుత్త్వం  ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాలను  రైతులు  సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ శంకర్ రాథోడ్ అన్నారు.  బుధవారం రెబ్బెన మండలంలోని నవేగం లో ఏర్పాటుచేసిన పశువైద్యశిబిరాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ  . కృషికళ్యాణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లలో 100 గ్రామాలు ఎంపికైనట్లు అందులో రెబ్బెన మండలంలోని రెబ్బెన, తుంగేడ , గంగాపూర్, ఖైర్గం, నవేగం, వంకులం  గ్రామాలు ఉన్నట్లు తెలిపారు. ఈ గ్రామాలలో ఈనెల 27 వరకు శిబిరాలు కొనసాగుతాయని అన్నారు. ఈ శిబిరాలలో పశువులకు కృత్రిమ ఘరహదారణ సంచులను పంపిణి చేస్తారని అన్నారు.   ఈ కార్యక్రమంలో రెబ్బెన పశు   వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment