Sunday, 23 December 2018

సమ్మెను విజయవంతం చేయాలి

కోమురం భీంమ్ రెబ్బెన  డిసెంబర్ 23 :  దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెలో  సింగరేణి కాంట్రాక్టు కార్మికులు పాలుగోని విజయవంతం చేయాలి 
జనవరి 8,9 తేదీలలో దేశ వ్యాపిత సమ్మెలో సింగరేణి కార్మికులు పాలుగోని విజయవంతం చేయలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)గోలేటి బ్రాంచ్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్,సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంగం (ఇఫ్ట్)గోలేటి బ్రాంచ్ ప్రెసిడెంట్ బండారి తిరుపతి అన్నారు..
ఈ వారు మాట్లాడుతూ సింగరేణిలో ని కాంట్రాక్టు కార్మికులను సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,అలాగే కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని,కాంట్రాక్టు కార్మికులను అందరిని పర్మనెంట్ చేయాలని అన్నారు,
కొలిండియా జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని అన్నారు,2013 నుంచి కాంట్రాక్టు కార్మికులను హై పవర్ కమిటి (HPC) అమలు చేయాలని అన్నారు,కార్మిక కుటుంబ సభ్యులందరికి కార్పొరేట్ వైద్యం అందించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కార్మిక చట్టాలను  సింగరేణి యాజమాన్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు..
ఈ సమావేశంలో కాంట్రాక్టు కార్మికులు రాజుకుమారు,శ్రీనివాస్,ప్రవీణ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment