Wednesday, 19 December 2018

రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 19 ; వరంగల్ లో జనవరి 5 నుండి 7 వరకు   జరిగే రాష్ట్ర స్థాయి చెక్ ముఖి టాలెంట్ టెస్ట్ లో మంచి  ప్రతిభా పాటవాలను కనపరచి  మండలానికి పేరు తేవాలని రె బ్బెన ఎస్ ఐ దీకొండ   రమేశ్ అన్నారు.  బుధవారం రెబ్బెన మండల కేంద్రంలోని సాయి విద్యాలయంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన  విద్యార్థులను అభినందించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్దగా చదివి మంచి భవిస్యత్త్తు నిర్మించుకోవాలని అన్నారు. మండలం లోని విద్యార్థులు  వర్ష, కనకలక్ష్మి, హర్షవర్ధన్, శిరీషాలకు రాష్ట్రస్థాయియిలో బహుమతులు గెలవాలని ఆశీర్వదించారు.  ఈ కార్యక్రమంలో కరెస్పాండంట్ విజయ కుమారి,  ప్రధానోపాధ్యాయులు సంజీవకుమార్, ఉపాధ్యాయులు సుజాత, రేష్మ, ఆనంద్ రావు , తిరుపతి, మహేందర్ , మౌనిక, భాగ్య , స్వప్న, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment