Monday, 3 December 2018

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ; జీఎం కే రవిశంకర్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, ; అంగవైకల్యం ఉందని కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని   జీఎం  కే రవిశంకర్  అన్నారు. ప్రపంచ దివ్యంగా దినోత్సవాన్ని పురస్కరించుకొని  బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్ షిప్లోని సింగరేణి పాఠశాల మైదానంలో సోమవారం  దివ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ రవి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం  డిసెంబర్ మూడున దివ్యాంగుల దినోత్సవాన్ని సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తుందని  దివ్యాంగులు అంగవైకల్యం ఉందని కుంగిపోకుండా పట్టుదలతో కృషి చేసి ఆయా రంగాల్లో ఉన్నత స్థాయిల్లో వున్నారని అన్నారు ఈ సందర్భంగా దివ్యాంగులకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అందరికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వారికి పాటలు పాడి డ్యాన్సులు చేసిన వారికి బహుమతులను ప్రదానం చేశారు.   ఈ కార్యక్రమంలో ఇంచార్జి  డిజిఎం పర్సనల్ సుదర్శనం, డిజి డివైపిఎం ఎల్ రామశాస్త్రి డబ్ల్యూపీఎస్ స్పోర్ట్స్ సూపర్ వైజర్   రమేష్ ,  చంద్రకుమార్,   భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment