Sunday, 30 December 2018

స్థానిక సంస్థ ఎన్నికలో యువతకు పెద్దపీట వేస్తాం ; సీపీఐ మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్య

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 30:  రాబోయే స్థానిక సంస్థల  ఎన్నికలో రెబ్బన మండలంలోని అన్ని గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిచ్చి  పార్టీ అభ్యర్థులను పెడతామని సీపీఐ మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్య అన్నారు..ముఖ్యంగా  గోలేటిలో పార్టీ తరుపున ఈ సారి అభ్యర్థి బరిలో ఉంటాడని అన్నారు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాజకీయ  పార్టీలు ఇప్పటికే  తాయిలాలు ప్రకటిస్తున్నాయని అన్నారు. ప్రజలు ఈ తాయిలాలు ఆశపడి అభ్యర్థులను ఎన్నుకోవద్దని, నిజంగా ప్రజలపక్షాన నిలబడి, ఊరికి మంచి చేసే అభ్యర్థులనే గెలిపించాలని అన్నారు. .రాబోయే ఎన్నికలలో  సీపీఐ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే, గ్రామాలను  అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని  అన్నారు.

No comments:

Post a Comment